య‌థేచ్ఛ‌గా థియేట‌ర్ తిండి దందా

Update: 2018-08-02 08:56 GMT

అదే పాత దందా.. అదే దోపిడీ.. ఈ థియేట‌ర్లు మార‌వు! మ‌ల్టీప్లెక్సుల తీరు అస‌లే మార‌దు!! ఇంకా ఇంకా నిలువు దోపిడీని ఎదుర్కోవాల్సిందే. అధికారులు వార్నింగులు ఇచ్చినా అంతే. వార్నింగులు ఇవ్వ‌క‌పోయినా అంతే.. వీళ్ల‌కు అడ్డూ ఆపూ లేదు. దొరికిన కాడికి దోచుకోవ‌డ‌మే వీళ్ల దందా. ఈ గేమ్‌ లో ఎవ‌డైతే ఏంటి?

ఇప్ప‌టికే క్లీన్‌ గా మార్గ‌ద‌ర్శ‌కాల్ని రూపొందించారు. వాట‌ర్ బాటిల్ నుంచి స‌మోసా - కోక్ - పాప్‌ కార్న్ అంటూ ప్ర‌తిదీ క‌మ‌ర్షియ‌ల్ చేసి నిలువుదోపిడీ సాగిస్తున్న థియేట‌ర్ ఓన‌ర్స్ - లీజుదార్లు - మ‌ల్టీప్లెక్స్ బాబులు ఇక ఈ దందా ఇప్ప‌ట్లో ఆపేట్టే క‌నిపించ‌డం లేదు. మ‌ల్టీప్టెక్సు స్టాల్స్‌ లో ఇంకా పాత రేట్ల‌తోనే అమ్ముతున్నారు. అధికారులు హుకుం జారీ చేసినా యాజ‌మాన్యం ఏమాత్రం ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. రూ.20 వాట‌ర్ బాటిల్ రూ.50- 100కే - కోక్‌ - పాప్‌ కార్న్ 300పైనే ధ‌ర ఉందింకా. ఇది మార‌దా?  సామాన్యుడిని బ‌త‌కిన‌వ్వ‌రా? స‌్పెష‌ల్ ఆఫీస‌ర్‌ అకున్ స‌బ‌ర్వాల్ ఆర్డ‌ర్స్‌ ని భేఖాత‌ర్ చేసిన హైద‌రాబాద్ థియేట‌ర్స్ - మ‌ల్టీప్లెక్సులు ఇక ఇంతేనా? ఏమో దేవుడే దిక్కు ఇక‌!!!
Tags:    

Similar News