అప్పుడు పుష్ప ఇప్పుడు అఖండ.. పోలీసుల వాడకం మామూలుగా లేదు

Update: 2022-01-23 16:30 GMT
ఈమద్య కాలంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారు ట్రాఫిక్ రూల్స్ ను సోషల్‌ మీడియా ద్వారా ఏ స్థాయిలో ప్రచారం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెండింగ్ వీడియోను మరియు ఫొటోలను తమదైన శైలిలో మార్ఫింగ్ చేసి ట్రాఫిక్‌ రూల్స్ పాటించే విధంగా వినియోగిస్తున్నారు. తాజాగా పుష్ప సినిమా లోని అల్లు అర్జున్‌ బైక్‌ పై వెళ్లే సన్నివేశం మరియు ఇతర ఫొటోలను హెల్మెట్‌ పెట్టి.. మాస్క్ పెట్టి అవగాహణ కల్పించే ప్రయత్నం చేశారు. సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ పుష్ప కు సంబంధించిన మార్ఫింగ్‌ ఫొటోలు మరియు వీడియోలతో హైదరాబాద్‌ పోలీసులు చాలా హడావుడి చేశారు. నిన్న మొన్నటి వరకు అవే ఫొటోలు వీడియో లు వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

అల్లు అర్జున్‌ పుష్ప తర్వాత ఇప్పుడు అఖండ సినిమాకు సంబంధించిన వీడియో ను పోలీసులు వినియోగించారు. సినిమా లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ హీరో బాలయ్య కారు ఎక్కిన సమయంలో సీటు బెల్టు పెట్టుకోక పోవడంతో ఒక్కసారిగా బ్రేక్ వేస్తే ముందుకు మొగ్గుతుంది. దాంతో ఆమె తలకు దెబ్బ తలుగుతుంది. అందుకే సీటు బెల్టు తప్పనిసరిగా వేసుకోవాలంటూ బాలకృష్ణ చెప్పి ఆమెకు స్వయంగా సీటు బెల్టు వేస్తాడు. అది పోలీసులు పట్టారు... సీటు బెల్టు వేసుకోవాలని ఇలా అవగాహణ కల్పించడం మంచి పని బాలకృష్ణ గారు అంటూ బాలయ్యను అభినందించడం మాత్రమే కాకుండా ఆ వీడియోను షేర్‌ చేసిన పోలీసులు సీటు బెల్టు వేసుకోవడం వల్ల యాక్సిడెంట్ సమయంలో ప్రాణాపాయం నుండి బయట పడవచ్చు అని చెప్పకనే చెప్పారు.

ప్రయాణించేది ఎంత దూరం అయినా.. మనం ఎక్కిన కారు ఎవరిది అయినా.. తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాల్సిందే అంటూ పోలీసులు చెప్పకనే చెప్పారు. రోడ్‌ సేఫ్టీ మరియు ట్రాఫిక్ రూల్స్ ను ప్రచారం చేసే ఇలాంటి సన్నివేశాలు చేసినందుకు గాను బోయపాటి శ్రీను గారికి మరియు నటించిన హీరో హీరోయిన్‌ గారికి కృతజ్ఞతలు అంటూ సోషల్‌ మీడియా ద్వారా ట్రాఫిక్ పోలీస్‌ టీమ్‌ ట్వీట్‌ చేయడం జరిగింది. ఎప్పటిలాగే ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం అఖండ సినిమా హాట్ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. పెద్ద ఎత్తున హాట్ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. బాలయ్య నటించిన ఈ సినిమా 200 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. వందకు పైగా సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

https://twitter.com/HYDTP/status/1485136987615272962
Tags:    

Similar News