కోలీవుడ్ స్టార్ హీరోలలో విజయ్ స్థానం ప్రత్యేకం. మొదటి నుంచి కూడా విజయ్ కి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు .. థియేటర్ల దగ్గర జాతర మొదలవుతుంది. ఫస్టు లుక్ వదిలిన దగ్గర నుంచి సినిమా హిట్టు అనిపించుకునేంత వరకూ ఆయన అభిమానులు రికార్డులను ఫాలో అవుతూనే ఉంటారు. ఇక విజయ్ సినిమా రిలీజ్ ఉందంటే - చాలా సినిమాలు ఆ తరువాతనే రిలీజ్ కి ముహూర్తం పెట్టుకుంటాయి. ఎందుకంటే ఎక్కడ ఏ థియేటర్లో చూసినా విజయ్ సినిమానే ఉంటుంది.
అలాంటి విజయ్ ఈ సంక్రాంతికి 'మాస్టర్' సినిమాతో పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెల 13 వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఎక్స్ బి ఫిల్మ్ క్రియేటర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి - అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించనుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మూడు భారీ హిట్ల తరువాత విజయ్ చేసిన సినిమా కావడంతో - అభిమానులంతా ఈ సినిమా కోసం మరింత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇక దర్శకుడు లోకేశ్ కనగరాజ్ విషయానికొస్తే, ఆయన టేకింగ్ ఒక ఎత్తు .. ఆయన స్క్రీన్ ప్లే మరో ఎత్తు. ఒక కథను ఎక్కడి నుంచి ఎలా మొదలుపెట్టాలో .. కథనాన్ని అన్ని వైపుల నుంచి ఎలా అల్లుకుంటూ రావాలో .. ఫైనల్ గా దానిని ఎక్కడ లాక్ చేయాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సందీప్ కిషన్ 'మానగరం' (నగరం) .. కార్తి 'ఖైదీ' సినిమాలు చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. స్క్రీన్ ప్లే ప్రధానంగా నడిచిన ఆ సినిమాలు స్క్రీన్ ప్లే కారణంగానే విజయాన్ని అందుకున్నాయి. అలాగే 'మాస్టర్' సినిమాకి కూడా ఆయన తనదైన స్టైల్లో స్క్రీన్ ప్లే వేశాడట. అందువలన మొదటి నుంచి చివరి వరకూ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుందని అంటున్నారు. ఆయన స్క్రీన్ ప్లే మంత్రం ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెడుతుందనే అనిపిస్తోంది మరి!