ఆ ప్రముఖ సింగర్‌ తన తల్లి అంటున్న 45 ఏళ్ల మహిళ

Update: 2020-01-03 06:56 GMT
1990 లలో హిందీ లో అనురాధ పౌడ్వాల్‌ స్టార్‌ సింగర్‌ గా వెలుగు వెలిగింది. ఒకనొక సమయంలో లతా మంగేష్కర్‌ కు గట్టి పోటీని కూడా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు తో అనురాధను గౌరవించింది. ఈమద్య కాలంలో అనురాధ గురించి మీడియాలో వార్తలు ఏమీ లేవు. ఆమెను జనాలు మర్చి పోతున్న ఈ సమయం లో అనూహ్యం గా వార్తల్లో నిలిచింది. 67 ఏళ్ల అనురాధ పౌడ్వాల్‌ తన తల్లి అంటూ కేరళ కు చెందిన 45 ఏళ్ల కర్మలా మోడెక్స్‌ అనే మహిళ మీడియా ముందుకు వచ్చింది. ప్రస్తుతం కోర్టులో అనురాధ తన తల్లి అంటూ కర్మలా న్యాయ పోరాటం చేస్తుంది. కాని అనురాధ మరియు ఆమె కుటుంబం మాత్రం కర్మలా వాదన ను కొట్టి పారేస్తున్నారు.

కర్మలా కోర్టులో చెప్పిన కథనం ప్రకారం.. అనురాధ మరియు ఆమె భర్త అరుణ్‌ పౌడ్వాల్‌ లు తమ కు పుట్టిన బిడ్డను కొన్ని రోజుల వయసు ఉన్న సమయంలోనే పొన్నచ్చన్‌ దంపతులకు ఇచ్చారట. ఆర్మీ ఆఫీసర్‌ అయిన పొన్నచ్చన్‌ ఆ తర్వాత కాలంలో కేరళ వెళ్లి స్థిరపడ్డాడట. కర్మలాకు ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితం పొన్నచ్చన్‌ చెప్పాడట. మృత్యువు ముందు ఉన్న సమయంలో పొన్నచ్చన్‌ ఈ విషయాన్ని కర్మలా కు చెప్పి మరణించాడట. అప్పటి నుండి అనురాధ పౌడ్వాల్‌ ను కలిసేందుకు కర్మలా ప్రయత్నాలు చేసిందట. కాని ఉపయోగం లేకుండా పోయిందట.

తనను చిన్నతనంలోనే వదిలేసినందుకు అనురాధ మరియు ఆమె భర్త అరుణ్‌ లు తనకు 50 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ కోర్టు ద్వారా కర్మలా డిమాండ్‌ చేస్తుంది. కోర్టు ఇప్పటి కే అనురాధ మరియు ఆమె కుటుంబ సభ్యులను కోర్టు కు హాజరు అయ్యి కర్మలా వాదనపై కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యం లో బాలీవుడ్‌ వర్గాల్లో ఈ విషయం హాట్‌ టాపిక్‌ అయ్యింది.

కర్మలా డీఎన్‌ ఏ టెస్ట్‌ కు సిద్దం అంటూ కోర్టుకు తెలియజేసింది. అనురాధ అండ్‌ ఫ్యామిలీ డీఎన్‌ ఏ టెస్టుకు ఎలా స్పందిస్తారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కర్మలా కోర్టు ద్వారా అనురాధ ఆస్తి లో వాటాను కూడా కోరుతుంది.

గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం. సెలబ్రెటీలు మరియు ప్రముఖుల పిల్లలం అంటూ చాలా మంది కోర్టు వరకు వెళ్లారు. కాని ఎక్కువ శాతం ఆ కేసులు వీగి పోయాయి. మరి ఇప్పుడు అనురాధ కూతురును అంటూ కర్మలా చేస్తున్న వాదన ఎంత వరకు నిలిచేనో చూడాలి.


Tags:    

Similar News