వర్జినిటీ ఎప్పుడు కోల్పోయాడో తెలుసా?

Update: 2016-10-04 07:30 GMT
బాలీవుడ్ లో సెలబ్రిటీల మధ్య ఇంటర్నల్ రిలేషన్స్.. ఎంజాయ్మెంట్స్  చాలానే ఉంటాయ్ కానీ.. వాటి గురించి బైటకు ఒప్పుకునే ధైర్యం ఎవరూ చేయరు. కానీ ధర్మ ప్రొడక్షన్స్ అధినేత.. బాహుబలి హిందీ వెర్షన్ నిర్మాత.. లవ్ స్టోరీల దర్శకుడు కరణ్ జోహార్ మాత్రం ఓపెన్ అయిపోయాడు.

హీరోయిన్ నేహా ధూపియా ఓ సెలబ్రిటీ టాక్ షో ప్రారంభించింది. నో ఫిల్టర్ నేహా అనే టైటిల్ పై.. ఓ ఎఫ్ఎం రేడియోలో ప్రసారం కానుంది. దీనికి మొదటి గెస్ట్ గా కరణ్ జోహార్ హాజరయ్యాడు. నేహా ధూపియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. చాలానే వ్యక్తిగత విషయాలను బైట పెట్టేశాడు కరణ్ జోహార్. 'కుచ్ కుచ్ హోతా హై సక్సెస్ తర్వాత నేను న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తున్నాను. అప్పుడు నాకు 26 ఏళ్లు. అప్పుడే తొలిసారిగా నేను నా వర్జినిటీ కోల్పాయా' అన్నాడు కరణ్ జోహార్.

అంతే కాదు.. యాక్షన్స్ తో కంటే మాటలతో తాను ఎక్కువగా ఫ్లర్ట్ చేయగలగుతానన్న కరణ్ జోహార్.. చాలా మందితో సెక్స్ ఛాట్ చేశానని.. ఫ్లర్టింగ్ విషయంలో కూడా తనకు బోలెడంత అనుభవం ఉందని చెప్పడం.. ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే చాలామందితో తనకు సెక్స్ అనుభవం ఉందన్న కరణ్ జోహార్.. ఆ అనుభవం తర్వాత మాంచి డ్రస్సులు కొనేందుకు షాపింగ్ చేయడాన్ని ఇష్టపడతానని అంటున్నాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News