ఆ నిర్మాత‌కి ఇండ‌స్ర్టీలో ఎవ‌రైనా డోంట్ కేర్!

Update: 2022-12-17 07:30 GMT
'ఐ డోంట్ కేర్' అనే ప‌దం  ఎవ‌రైనా!  చాలా రేర్ గా ఉప‌యోగించే ప‌దం. ఇప్పుడీ వ‌ర్డ్ టాలీవుడ్ ఇండ‌స్ర్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌లే ఓ బ‌డా నిర్మాత ఎవైరైనా స‌రే ఐడోంట్ కేర్ ...నేను ఎవ‌ర్నీ ప‌ట్టించుకోను. నా దారి నాదే...నేను ఎవ‌రి దారికి అడ్డు త‌గ‌ల‌ను.  నాదారికి అడ్డొస్తే! తొల‌గించుకుని ముందుకెళ్లే  నైజం ఉన్న వాడిని త‌ప్ప‌! స‌మ‌స్య వ‌చ్చింద‌ని బెదిరిపోయే ర‌కం కాదంటూ ఓ మీడియా  చిట్ చాట్ లో కాస్త గ‌ట్టిగానే చెప్పారు.

అందుకు  ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంది. అది అంతే స‌హేతుకంగానూ అనిపిస్తుంది. నిజ‌మే ఎవ‌రైనా స‌హాయం చేస్తే వాళ్ల‌కి రుణ ప‌డి ఉంటాం. అంద‌రికీ రుణ ప‌డి ఎందుకుంటాం?  ఆ నిర్మాత అన్న‌ది నూటికి నూరుపాళ్లు నిజ‌మే.  మాట‌ల సంద‌ర్భంలో! మీరు ఇండ‌స్ర్టీలో ఎవ‌రికైనా రుణ ప‌డి ఉన్నారా? అని  ఆ  నిర్మాత‌ను అడిగితే అత‌ను కేవ‌లం ..ప‌రిశ్ర‌మ‌కు రావ‌డానికి మార్గం చూపంచిన వాళ్ల‌కి మాత్ర‌మే రుణ‌ప‌డి ఉంటాను అని అన్నారు.

అంతే త‌ప్ప హీరోల‌కు గానీ....నిర్మాత‌ల‌కు గానీ...ఇత‌ర ద‌ర్శ‌కులుగానీ....పెద్ద‌ల‌కు గానీ ఎవ‌రికి రుణ‌ప‌డి లేను అని గట్టిగానే చెబుతాను. ఏ వేదిక‌పైనైనా ఇదే విష‌యం చెబుతాను అన్నారాయ‌న‌. ఇండ‌స్ర్టీలో ఎవ‌రి ప‌ని వాళ్లు చూసుకుంటారు. నువ్వు న‌ష్ట‌పోయినా..లాభ ప‌డినా నీ క‌థ లో నువ్వే క‌నిపిస్తావ్...ఇక్క‌డ ఎవ‌రూ స‌హాయం చేయ‌రు.

క‌ష్టాల్లో ఉన్నావంటే?  నీ వైపు అస్స‌లు చూడ‌రు. ఇదంతా నేను మాత్ర‌మే ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యం. అందులో నేను మాత్ర‌మే  ఉంటాను. నేను సినిమా చేస్తున్నా అంటే ఆ సినిమాకి త‌గ్గ పారితోషికం లైట్ బోయ్ తో స‌హా హీరోకి అంద‌రికి  ఎప్ప‌టిక‌ప్పుడు సెటిల్ చేసేస్తా. ఆ త‌ర్వాత వాళ్ల‌తో నాకెలాంటి సంబంధం ఉండ‌దు. వాళ్ల‌తో ర్యాపో కూడా మెయింటెన్ చేయ‌ను.

ఎందుకంటే ఇది వ్యాపారం. స్టార్  హీరో డేట్లు ఇచ్చాడ‌ని సంబ‌ర ప‌డిపోను. అత‌ను డేట్లు ఇస్తే నేను డ‌బ్బులు ఇస్తున్నాను. ఇండ‌స్ర్టీలో ఇదే నా లెక్క‌. ప‌రిశ‌మ్ర‌కు వ‌చ్చిన‌ప్పుడు  ఇదే యాటిట్యూడ్ తో ఉన్నా..ఇప్పుడు అలాగే ఉన్నా. తోపు తురుం అనే  క‌హానీలు నాక‌స్సులు న‌చ్చ‌వు. నేను రుణ‌ప‌డేది...రుణం తీర్చుకోలేనిది నేను ఈర‌కంగా స్థిర‌ప‌డ‌టానికి గ‌ల అసలు కార‌కులకు మాత్ర‌మేన‌ని ఉద్ఘాటించారాయ‌న‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News