ఆ ఐదొందల కోట్లలో వాటా వద్దంటున్న కార్తి

Update: 2016-11-30 06:33 GMT
‘‘మినిస్టర్ ఇచ్చిన 500 కోట్ల రూపాయల్లో నాకేమీ వాటా వద్దు.. మొత్తం మీరే ఉంచేసుకోండి’’ అంటూ ఓ సహనటుడిని ఉద్దేశించి ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు తమిళ హీరో కార్తి. ఇంతకీ మినిస్టరేంటి.. 500 కోట్లివ్వడమేంటి.. కార్తి వాటా వద్దనడమేంటి అంటారా..? ఇదేమంత సీరియస్ విషయం కాదులెండి. తమిళ స్టార్ కమెడియన్ వివేక్ పుట్టిన రోజు సందర్భంగా కార్తి ఆయన్ని ఉద్దేశించి పెట్టిన ట్వీట్ ఇది.

ఆ 500 కోట్ల మేటర్ ఏంటో.. దీపావళికి వచ్చిన కార్తి సినిమా ‘కాష్మోరా’ చూసిన వాళ్లకు అర్థమవుతుంది. అందులో కార్తి దొంగ బాబా పాత్రలో నటించాడు. వివేక్ అతడి తండ్రిగా కనిపించాడు. కార్తి ఓ మినిస్టర్ని బురిడీ కొట్టించి.. అతణ్ని తన శిష్యుడిగా మార్చుకుంటాడు. ఆ మినిస్టర్ ఇతణ్ని నమ్మి ఆదాయపు పన్ను అధికారులకు దొరక్కుండా తన దగ్గరున్న మొత్తం 500 కోట్ల డబ్బును కార్తి ఆశ్రమానికి ఇంటికి పంపిస్తాడు. ఆ డబ్బు తీసుకుని వివేక్ ఉడాయిస్తాడు.

ఈ నేపథ్యంలోన వివేక్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. మినిస్టర్ ఇచ్చిన డబ్బంతా మీరే ఉంచేసుకోండి.. నాకేం వాటా అక్కర్లేదు అంటూ చమత్కరించాడు కార్తి. వివేక్ తో కార్తికి మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ ‘కాష్మోరా’ షూటింగ్ టైంలో బాగా క్లోజ్ అయిపోయారు. ఈ సినిమా ఆడియో వేడుకలో కార్తిని ఓ రేంజిలో పొగిడాడు వివేక్. అతనెప్పుడూ ఏ హీరోనీ ఆ స్థాయిలో పొగిడింది లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News