ఈవ్ టీజింగ్ కి బాధితురాలినే -ఇలియానా

Update: 2017-02-02 10:05 GMT
కొన్నేళ్లుగా రకరకాల ఫోటోలు.. వీడియోలను తన సోషల్ నెట్వర్క్ పేజ్ లలో పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తోంది గోవా బ్యూటీ ఇలియానా. సడెన్ గా ఏమైందో కానీ.. బోలెడన్ని సీక్రెట్స్ చెప్పేసింది. ఈవ్ టీజింగ్ కారణంగా తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని చెప్పింది.

'నేను నా మాజీ పంపిన కొన్ని డర్టీ మెసేజ్ లు వాయిస్ నోట్స్ లను షేర్ చేస్తున్నా. ఎందుకంటే.. నాకు అతడు మరో ఛాన్స్ ఇవ్వలేదు' అనే ఆర్టికల్ ను షేర్ చేసింది ఇలియానా. ఇందులో ఆ అమ్మాయి-బాయ్ ఫ్రెండ్ లకు సంబంధించిన ఛాట్ మెసేజ్ స్క్రీన్ షాట్స్.. కొన్ని వాయిస్ మెసేజ్ లు   ఉన్నాయి. 'ఇది చాలా ఘోరమైన విషయం. ఇతడిని గురించి షేర్ చేసిన అమ్మాయిని చూసి గర్వపడుతున్నా' అంటూ ట్వీట్ పెట్టింది ఇలియానా.  తాను కూడా ఇలాంటి ఈవ్ టీజింగ్ ను ఫేస్ చేయాల్సి వచ్చిందినని చెప్పింది ఇల్లీ బేబీ.

'నేనుకూడా ఈవ్ టీజింగ్ కి బాధితురాలినే. ఆ వేధింపుల కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. అయితే.. నాకు అవసరమైనపుడు మద్దతు ఇచ్చే ఎంతో అందమైన మనసున్న తల్లిదండ్రులు ఉండడం నా అదృష్టం' అని చెప్పింది ఇలియానా. ప్రస్తుతం ఈవ్ టీజింగ్.. లైంగిక వేధింపులకు సంబంధించి తమ అనుభవాలను చాలామంది బాలీవుడ్ తారలు పంచుకోవడం.. చర్చనీయాంశం అవుతోంది. రీసెంట్ గా హాలీవుడ్ నటి ఆష్ లే జుడ్.. తనపై 14 ఏళ్లకే రేప్ జరిగిందని చెప్పింది కూడా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News