నేను ఏ స్టేట్మెంటూ ఇవ్వలేదు -పూరి జగన్

Update: 2017-07-15 09:25 GMT
ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ స్కాండల్ యవ్వారంలో దర్శకుడు పూరి జగన్ పేరే ప్రముఖంగా వినిపించింది. ముఖ్యంగా ఆ స్కాండల్ లో బయటకొచ్చిన చాలావరకు పేర్లన్నీ ఆయన క్యాంపులో వినిపించే పేర్లే. వారందరూ ఆయన ఆఫీసులో తరచూ కనిపించేవారు. అయితే ఈ యవ్వారంపై పూరి ఒక ఘాటైన కామెంట్ చేశాడని మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

''మీకు దమ్ముంటే అసలు ఇందులో ఉన్న పెద్ద తలకాయల పేర్లను బయటపెట్టండి. ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు?'' అంటూ పూరి ఫైర్ అయినట్లు న్యూసు వచ్చేసింది. ఈ క్రమంలో పూరి ఎట్టకేలకు స్పందించాడు. ''నేను ఇప్పటివరకూ ఎవ్వరిగురించి కానీ.. దేని గురించి కానీ.. ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. నా పైసా వసూల్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాను'' అంటూ ట్వీటేశాడు పూరి జగన్. ఇక్కడే మనం రెండు విషయాలు అర్ధం చేసుకోవచ్చు. ఒకటి ఆయన డ్రగ్స్ అనే పదాన్నే వాడలేదు కాబట్టి.. ట్వీట్ విషయంలో కూడా లీగల్ చిక్కులు రాకుండా భలే చెప్పినట్లే. రెండు.. మార్కెట్లో తనపై ఎలాంటి రూమర్లు వచ్చినా కూడా.. తను మాత్రం తనపని తాను చేసుకుంటూ పోతాను అన్నట్లు మరోసారి చెప్పకనే చెప్పాడు.

ఇకపోతే మీడియాలో వచ్చిన పేర్లతో మాకు సంబంధం లేదంటూ ఆల్రెడీ ఎక్సయిజ్ శాఖ చేతులు ఎత్తేయగా.. అనవసరంగా ఇంతమంది పేర్లు బయటకు వచ్చి ఇండస్ర్టీ  పరువుపోవడం ఇష్టంలేని పెద్దలు పైరవీలు చేస్తున్న కారణంగా.. తన సెలవును అర్ధాంతరంగా ముగించుకుని ఎక్సయిజ్ డైరక్టర్ అకున్ సబర్వాల్ తిరిగొచ్చారనే టాక్ వినిపిస్తోంది. చూద్దాం 19వ తారీఖు తరువాత ఏ సెలబ్రిటీలు విచారణకు అటెండ్ అవుతారో!!
Tags:    

Similar News