'ఆహా 2.0' ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. 'ఆహా' ముందు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి .. ఎలాంటి ప్రయోగాయాలు ఉన్నాయనేది ఈ వేడుక ద్వారా వివరించారు. 'ఆహ ద్వారా ప్రేక్షకులను పలకరించిన 'కలర్ ఫోటో' సినిమాకి గాను, సుహాస్ బెస్ట్ యాక్టర్ అవార్డును అల్లు అర్జున్ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ .. "నా ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది.
బన్నీఅన్నా సినిమాలను చూసి .. ఆయన తెరపై చేసిన డాన్సులను నేను చేసేవాడిని. 'ఆర్య' సినిమా దగ్గర నుంచి ఆయన ఏ డాన్స్ చేస్తే ఆ డాన్స్ నేను స్టేజ్ లపై వేస్తూ ప్రైజులు తెచ్చుకునేవాడిని. 9th .. 10th క్లాస్ ల నుంచి ఆయనను చూస్తూ వచ్చిన వాడిని. సడెన్ గా ఆయన పక్కన స్టేజ్ పై నిలబడాలంటే భయంతో వణుకు వస్తోంది. ఆయన చేతుల మీదుగా నేను ఈ వార్డును తీసుకుంటానని అసలు ఊహించలేదు.
'కలర్ ఫోటో' థియేటర్లలో రిలీజ్ కాకపోయినా, థిఏయేటర్లలో రిలీజ్ అయిన ఆనందాన్ని .. అనుభూతిని ఇచ్చారు. ఆ స్థాయిలో ప్రమోషన్స్ ఇచ్చి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ ముగించాడు.
ఇక 'లాక్డ్' అనే ఒక వెబ్ సిరీస్ కి సత్యదేవ్ కూడా బన్నీ చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ .. "నా లైఫ్ లో ఫస్టు అవార్డు ఇది. దీనిని బన్నీ సార్ చేతుల మీదుగా తీసుకోవడం మరింత స్పెషల్. నేను చేసిన ఆ వెబ్ సిరీస్ ఒక థ్రిల్లర్. ముందుగా అది నచ్చింది అల్లు అరవింద్ గారికే. అందువల్లనే నేను ఆ వెబ్ సిరీస్ చేయగలిగాను. ఇందాకటి నుంచి ఈ స్టేజ్ పై ఒక డైలాగ్ వినిపించక సందడి తగ్గింది .. అంటూ 'తగ్గేదే లే' అనేశాడు. దాంతో అక్కడ అంతా మళ్లీ సందడి వాతావరణం నెలకొంది.