రష్మిక డెడికేషన్ చూసి షాక్ అయ్యాను: శర్వానంద్

Update: 2022-02-15 10:30 GMT
కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో కొంతసేపటి క్రితం జరిగింది. ఈ వేదికపై శర్వానంద్ మాట్లాడుతూ .. 'శతమానం భవతి' తరువాత నేను ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయలేదేమిటని చాలామంది అడుగుతున్నారు. అలాగే 'మహానుభావుడు' వంటి ఒక ఎంటర్టైనర్ మళ్లీ ఎప్పుడని అంటున్నారు. ఫ్యామిలీ మూవీ .. ఎంటర్టైనర్ ఈ రెండు కలిసిన సినిమా చేయాలి .. పాత శర్వాని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్లాలని నేను కూడా అనుకున్నాను. అలా అనుకుని చేసిన సినిమానే 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.

ఈ సినిమా చూసిన వాళ్లంతా ఒక మంచి సినిమాను చూశామనే చిరునవ్వుతో ఇంటికి వెళతారు. ఈ సినిమాను గురించి పూర్తిస్థాయిలో నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్ లో మాట్లాడతాను. ఇండస్ట్రీకి రావడం .. రాధిక .. ఖుష్బూ గారి వంటి గొప్ప ఆర్టిస్టులతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారు తమ అనుభవాలు చెబుతుంటే నాకు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించాయి.

ఈ సినిమా సెట్ నుంచి నేను వాళ్లని చాలా మిస్సవుతున్నట్టే. షూటింగు సమయంలో సెట్లో ఒక సెలబ్రేషన్ లా ఉండేది. ఆడవాళ్లంతా గుండ్రంగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, నేను ఆ పక్కనే కూర్చుని వింటూ ఉండేవాడిని. అది నాకు చాలా సరదాగా అనిపించేది.

ముఖ్యంగా రష్మికతో పనిచేయడం చాలా సరదాగా .. సంతోషంగా అనిపించింది. రష్మిక డెడికేషన్ చూసి నేను షాక్ అయ్యాను. ఆ సమయంలో ఆమె 'పుష్ప' సినిమా కూడా చేస్తోంది. ఎక్కడో మారేడుమిల్లి నుంచి వచ్చేది. ఇక్కడ ఒక రెండు రోజులు షూటింగు చేసుకుని మళ్లీ వెళ్లిపోయేది. షూటింగుకి నేను ఎప్పుడైనా కొంచెం లేట్ గా వెళ్లేవాడినేమోగానీ, తను మాత్రం టైమ్ కి వచ్చేసేది. ఆమె అంకితభావానికి హ్యాట్సాఫ్ చెబుతున్నాను.

ఇక మా డైరెక్టర్ కిశోర్ గారి విషయానికి వస్తే, కథాకథనాలపై ఆయనకి మంచి పట్టుంది. ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా .. కామెడీ కోసం సినిమా చేయడం కాదు, కథలో బలం ఉండాలి .. అవి ఆ కథకి యాడ్ అవ్వాలి అనే ఆయన ఆలోచన నాకు నచ్చింది.

ఇంతమంచి స్క్రిప్ట్ ను ఆయన నా దగ్గరికి తీసుకుని వచ్చినందుకు .. ఇంత బాగా తీసినందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఏడాదికి ఒక రెండు నెలలు కేటాయించుకుని మా కాంబినేషన్లో ఒక సినిమా చేసేయాలని అనుకున్నాము. ఈ సినిమా షూటింగు రోజులు అంత సరదాగా గడిచిపోయాయి. సరదాగా అలా షూటింగుకి వెళ్లి ఎంజాయ్ చేసి వస్తున్నట్టుగా నాకు అనిపించేది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఎంత సరదాగా .. సందడిగా అనిపించిందో ఆడియన్స్ కి కూడా అలాగే అనిపిస్తుంది. ఈ నెల 25వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వస్తుంది .. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది" అని చెప్పుకొచ్చాడు.  
Tags:    

Similar News