ఆడితే.. సానిమా మీర్జాకు పెళ్లి కాదన్నారట!

Update: 2019-10-04 05:25 GMT
టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి తెలియని వారుండరు. టెన్నిస్ క్రీడలో తనకంటూ ఒక స్థానాన్ని సొంతం చేసుకున్న ఆమె ఈ స్థాయికి చేరుకోవటం కోసం ఎన్ని కష్టాలకు గురైందన్న విషయం వింటే విస్మయం చెందాల్సిందే. క్రీడాకారిణిగా ఎదిగే సమయంలో తనకు ఎదురైన అనుభవాల్ని తాజాగా ఆమె చెప్పుకుంది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్యానల్ చర్చలో పాల్గొన్న సానియా తన బాల్యంలో తనకు ఎదురైన అనుభవాల్ని వెల్లడించారు. ఎనిమిదేళ్ల వయసులో తాను టెన్నిస్ ఆడుతుంటే.. ఆడొద్దని హెచ్చరించాని.. ఇంకొందరైతే ఔట్ డోర్ లో టెన్నిస్ అడితే నల్లగా అయిపోతావ్.. తర్వాత పెళ్లి కాదన్నారన్నారు.

అంతా మన మంచికే జరుగుతుందని తనకు తాను ధైర్యం చెప్పుకునేదానినని చెప్పారు. అమ్మాయిలంటే ఎర్రగా.. అందంగా ఉండాలనుకునే కల్చర్ మన వ్యవస్థలో బలంగా నాటుకుపోయిందన్నారు. ఇలాంటివి మారాలన్న అభిలాషనను వ్యక్తం చేశారు.

చిన్నవయసులో తనకు ఎదురైన ఇబ్బందుల్ని పట్టించుకోకుండా తాను ఆట మీదనే ఫోకస్పెట్టారన్నారు. తనకు రోల్ మోడల్ ఒకప్పటి ప్రముఖ అథ్లెట్ పీటీ ఉష అని చెప్పారు. భారత సమాజంలో బయట వాళ్ల కంటే కూడా దగ్గర వాళ్ల నుంచే ఎక్కువ విమర్శలు ఎదురవుతాయని చెప్పుకొచ్చారు. సానియా మీర్జా ఒక్క క్రీడాకారిణి కారణంగా.. దేశంలో వేలాది మంది టెన్నిస్ ఆట మీద మక్కువ పెంచుకోవటమే కాదు.. సీరియస్ గా ప్రాక్టీస్ చేయటాన్ని కొట్టిపారేయలేం.


Tags:    

Similar News