మాస్ మహారాజ్ తో మరో సినిమా చేస్తాను: అనిల్ రావిపూడి

Update: 2022-07-16 15:37 GMT
రవితేజ హీరోగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో, శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ ..  రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వచ్చాయి. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో  విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - పార్క్ హయత్ హోటల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

ఈ ఈవెంట్ కి అనిల్ రావిపూడి ..  త్రినాథరావు నక్కిన .. సుధీర్ వర్మ తదితరులు హాజరయ్యారు. గతంలో రవితేజతో 'రాజా ది గ్రేట్' చేసిన అనిల్ రావిపూడి ఈ స్టేజ్ పై మాట్లాడుతూ .. "ట్రైలర్ చూశాను .. చాలా బాగుంది. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

విజువల్స్ చాలా గొప్పగా అనిపించాయి. శరత్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశాడనిపిస్తోంది.  అందులో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తోంది. రవితేజని ఎందుకు మాస్ మహారాజ్ అంటారనేది మీలో కూర్చొని మాషప్ చూస్తే అర్థమైంది.

ఆయన లుక్ .. స్టైల్ .. డైలాగ్ .. ఇలా ఒకటి కాదు, అన్నిటిలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఆయన మాస్  మహారాజ్ అయ్యారు. ఆయన మాస్ మహారాజు మాత్రమే కాదు, మంచి మనసున్న మహారాజు. ఎందుకంటే చాలామంది దర్శకులకు ఆయన ఛాన్స్ ఇచ్చారు .. వాళ్లు పెద్ద డైరెక్టర్లు కావడానికి కారణమయ్యారు. అలాగే టఫ్ టైమ్ లో ఉన్న దర్శకులకు కూడా మళ్లీ ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్లు నిలదొక్కుకునేలా చేశారు.

ఆయన మనకి ఒక అవకాశం ఇచ్చేసి .. సినిమా చేసి వెళ్లిపోతారు. ఆయనతో కలిసి మళ్లీ ఎప్పుడు సినిమా చేసే అవకాశం వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాము. ఆయనతో కలిసి మళ్లీ ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. త్వరలోనే మా కాంబినేషన్లో మరో సినిమా ఉంటుంది. 'రామారావు ఆన్ డ్యూటీ' అనేది మాస్ పవర్ఫుల్ టైటిల్ .. ఈ నెల 29వ తేదీన రాబోతోంది. ఆ రోజున మీరు కూడా ఆన్ డ్యూటీలో ఉండాలని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.  
Tags:    

Similar News