ఐక‌న్ స్క్రిప్టుపై దృష్టి సారించిన ఐక‌న్ స్టార్

Update: 2021-06-20 03:30 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐక‌న్ స్టార్ గా ప్ర‌మోటైన సంగ‌తి తెలిసిందే. ఐక‌న్ గా న‌టించే క్ర‌మంలోనే ఈ డెవ‌ల‌ప్ మెంట్ ఆస‌క్తిని పెంచింది. ప్ర‌స్తుతం అత‌డు పుష్ప పెండింగ్  చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి `ఐక‌న్` పై పూర్తిగా దృష్టి సారించాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ లాక్ డౌన్ సీజ‌న్ లో ఆదిత్య శ్రీ‌రామ్ - దిల్ రాజు బృందంతో క‌లిసి స్క్రిప్టుపై దృష్టి సారించారు. పుష్ప 1 పూర్త‌వ్వ‌గానే ఐక‌న్ ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను బ‌న్ని కోరారు.

తాజా స‌మాచారం మేర‌కు.. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం స్క్రిప్టింగ్ సెషన్లలో చురుకుగా పాల్గొంటున్నాడు. శ్రీరామ్ వేణు- అల్లు అర్జున్ - దిల్ రాజు బృందం ఫైన‌ల్ స్క్రిప్టును లాక్ చేసే పనిలో ఉన్నారు.  ఐక‌న్ ని నెక్ట్స్ లెవ‌ల్ పాన్-ఇండియా మూవీగా తీర్చిదిద్దాలన్న‌ది వీరి ప్లాన్.

తుది స్క్రిప్ట్ అతి త్వరలో లాక్ చేయ‌నున్నార‌ని కూడా తెలుస్తోంది. స్క్రిప్ట్ ఫైన‌ల్ కాగానే తదనుగుణంగా సినిమాని వెంట‌నే ప్రారంభిస్తారు. అనంత‌రం కీల‌క తారాగణం స‌హా సాంకేతిక నిపుణుల‌ను ఖరారు చేస్తారు. బ‌న్ని న‌టిస్తున్న పుష్ప కీల‌క షెడ్యూల్ కోసం సుకుమార్ ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News