శ్రీకాంత అడ్డాల.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఆర్య2.. బొమ్మరిల్లు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా వ్యవహరించటమే కాదు.. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా కొత్త బంగారులోకంతో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. అంతేనా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ముకంద లాంటి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరొందిన ఆయనకు కెరీర్ లో ఊహించిన షాక్ తగిలేలా చేసింది మాత్రం మహేశ్ బాబుతో చేసిన బ్రహ్మోత్సవం. భారీ డిజాస్టర్ గా మారిన ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల మరో సినిమా చేయలేదు. తాజాగా ఆయన వెంకటేశ్ హీరోగా నటించిన నారప్ప చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. భారీ హైప్ ఉన్న ఈ సినిమాను కరోనా నేపథ్యంలో థియేటర్లలో కాకుండా.. ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద నేరుగా విడుదల చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద నేరుగా విడుదల అవుతున్న సందర్భం ఇదే. రానున్న రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త మార్గంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. అమెజాన్ లో విడుదల అవుతున్న ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. నారప్ప మూవీని ఓటీటీలో విడుదల చేయటాన్ని సినీ రంగానికి చెందిన కొందరు తప్పుపడుతుంటే.. మరికొందరు సమర్థిస్తున్నారు. భిన్నమైన వాతావరణంలో నారప్ప మూవీ రిలీజ్ అవుతోంది. తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్న సురేశ్ బాబు.. పలు మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇలాంటివేళ.. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సినిమాల్లో అవకాశాలు రావటానికి టాలెంట్ మాత్రమే సరిపోదని.. నోరు తెరిచి అడగకుండే వచ్చే అవకాశం ఉండదన్న విషయం ఆయన మాటల్లో అర్థం కాక మానదు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే..‘‘ఒక రోజు శ్రీకాంత్ అడ్డాల కథ చెప్పటానికి ఆఫీసుకు వచ్చాడు. తర్వాత మాటల సందర్భంలో మీరుఅసురన్ రీమేక్ చేస్తున్నారని తెలిసింది. ఎవర్నీ అనుకోకపోతే నేను దర్శకత్వం వహించాలనుకుంటున్నా అని అడిగాడు. కథను అతను అవగాహన చేసుకున్న తీరు నచ్చింది. ఓకే చెప్పాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
సురేశ్ బాబు చెప్పిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి.. పెద్ద దర్శకుల జాబితాలో ఉన్న శ్రీకాంత్ అడ్డాల లాంటి వారు సైతం.. అవకాశం కోసం నోరు తెరిచి అడిగితే కానీ ఛాన్సు రాదా? అన్నదిప్పుడు చర్చగా మారింది.