అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ''పుష్ప'' చిత్రాన్ని రెండు భాగాలుగా చేస్తున్నారనే విషయం కంఫర్మ్ అయింది. ఒక సాంగ్ కొన్ని సీన్స్ మినహా ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కి తగినంత షూటింగ్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. స్పాన్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి రెండున్నర గంటల్లో చెప్పడం చాలా కష్టమని మేకర్స్ 2 పార్ట్స్ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ రెండు భాగాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిత్తించేలా ఎలా రూపొందిస్తారనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.
టాలీవుడ్ లో 'ఎన్టీఆర్ బయోపిక్' 'బాహుబలి' సినిమాలు రెండు భాగాలుగా చెప్పబడ్డాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్రను 'కథానాయకుడు' 'మహనాయకుడు' పేర్లతో 2 పార్ట్స్ గా రిలీజ్ చేస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. అయితే మాస్టర్ మైండ్ రాజమౌళి 'బాహుబలి' చిత్రాన్ని 'బిగినింగ్' 'కన్క్లూజన్' పేర్లతో విడుదల చేస్తే ఆడియన్స్ ఆదరించారు. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో వచ్చే పెద్ద ట్విస్ట్ అనేది రెండవ భాగం బ్లాక్ బస్టర్ గా నిలవడానికి ప్రధాన కారణాలలో ఒకటని చెప్పవచ్చు.
'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే ప్రశ్న జనాల్లోకి తీసుకెళ్లిన రాజమౌళి అండ్ టీమ్.. దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ జరిగేలా చేశాడు. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించగలిగారు కాబట్టే ఈ ప్రయోగం సక్సెల్ అయింది. వాస్తవానికి 'బాహుబలి' చిత్రాన్ని ముందుగా ఒక సినిమాగా తీయాలనే స్టార్ట్ చేశారు. కానీ లెంత్ ఎక్కువ అవుతుండంతో రెండు భాగాలుగా చేసి సక్సెస్ అయ్యారు. వారి ఇండియాకు తగ్గట్టే కథను మలిచారు.
ఇప్పుడు ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ రూపొందిస్తున్న 'పుష్ప-1' క్లైమాక్స్ ని బట్టే పార్ట్-2 రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. రెండు భాగాలకు సరిపడా కంటెంట్ ఉందని సుక్కూ అండ్ టీమ్ భావిస్తున్నా.. దాన్ని ఏ విధంగా డివైడ్ చేసి చెప్పబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు సుకుమార్ తన రచయితల బృందంతో ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ గురించే ఎక్కువగా డిస్కష్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విధంగా 'పుష్ప' ప్రేక్షకుల్లో ఎలాంటి క్యూరియాసిటీ కలిగిస్తారో చూడాలి. ఇంత చేసినా 'బాహుబలి' కి జరిగిందే 'పుష్ప' విషయంలో జరుగుతుందని అనుకుంటే పొరపాటే. అంతేకాదు ఒకవేళ పార్ట్-1 కు మిస్ ఫైర్ అయితే సెకండ్ పార్ట్ పరిస్థితి ఎంటనేది ఆలోచించాలి.
ఇదిలా ఉండగా 'పుష్ప-2' కోసం అల్లు అర్జున్ దాదాపు 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి భాగం నిర్మాణంలో మైత్రీ వారితో పాటుగా తన రిలేటివ్స్ 'ముత్యంశెట్టి మీడియా' వారిని భాగస్వామిగా చేసిన బన్నీ.. సుమారు 30 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడని టాక్. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ విషయంలో మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు ఒక్కరే నిర్మించే విధంగా.. అందుకు గాను బన్నీకి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది.