మెగా బ్రదర్ నాగబాబు ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ను రెగ్యులర్ గా నిర్వహిస్తూ ఉన్నాడు. కొన్ని సీరియస్ క్వశ్చన్స్ తో పాటు సిల్లీ క్వశ్చన్స్ కు కూడా నాగబాబు సమాధానాలు చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. నాగబాబు నెట్టింట చేస్తున్న సందడి అంతా ఇంతా కాదన్నట్లుగా ఉంది. ఆమద్య తన కొడుకు పెళ్లి గురించి.. తన రెండవ పెళ్లి గురించి ఇంకా ఆరెంజ్ సినిమా నష్టాల గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన నాగబాబు తాజా సెషన్ లో ఒక నెటిజన్ అడిగిన ఆస్తికి సంబంధించిన ప్రశ్నకు తనదైన శైలిలో అదిరిపోయేలా సమాధానం ఇచ్చాడు.
ఒక వ్యక్తి సర్ మీరు ఉండే ఇళ్లు విలువ రూ.50 కోట్లు ఉంటుందా అంటూ ప్రశ్నించగా నాగబాబు స్పందిస్తూ.. ముఖేష్ అంబానీ ఇంటి కంటే 10 రూపాయలు మాత్రమే తక్కువ అంతే. మిగిలినదంతా సేమ్ టు సేమ్ అంటూ సమాధానం ఇచ్చాడు. మరో నెటిజన్ ఎంత ఆస్తి ఉంది నీకు అంటూ ప్రశ్నించగా.. నువ్వు అని సంభోదించావు. రెస్పెక్ట్ తగ్గిపోయింది. సో చెప్పను. రెస్పెక్ట్ గా మీకు ఎంత ఆస్తి ఉంది అని అడిగి ఉంటే ఖచ్చితంగా నా ఆస్తి ఎంత ఉందో చెప్పి అందులో సగం ఇచ్చేవాడిని. బ్యాడ్ లక్ అంటూ ఆ నెటిజన్ కు కౌంటర్ ఇచ్చాడు.
జబర్దస్త్ షో నుండి తప్పుకున్న తర్వాత నాగబాబు జీ తెలుగు లో అదిరింది.. బొమ్మ అదిరింది అంటూ షో లు చేశాడు. కాని అవి సక్సెస్ కాలేదు. ఇక తన సొంత యూనిట్ ఛానెల్ లో కామెడీ షో చేయడం జరిగింది. ఏదో ఒక పనితో బిజీ బిజీగానే ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఈమద్య సోషల్ మీడియాలో రెగ్యులర్ గా చిట్ చాట్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటున్నాడు.