తాప్సీ ఎదుటే డైరెక్ట‌ర్ బిగ్గ‌ర్ b**bs కామెంట్!

Update: 2022-08-16 14:23 GMT
మేల్ డామినేష‌న్ ని వేధింపుల ప్ర‌హ‌స‌నాన్ని నిల‌దీసే తాప్సీ ముందే అత‌డు `బిగ్గ‌ర్ b**bs` అంటూ కామెంట్ చేశాడు. కానీ దానికి తాప్సీ స్పంద‌న ఎలా ఉందో చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఇంత‌కీ తాప్సీ ముందే అలాంటి ఘాటైన న్యూడ్ కామెంట్ చేసింది ఎవ‌రు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

ప్ర‌స్తుతం తాప్సీ క‌థానాయిక‌గా న‌టించిన `దోబారా` విడుద‌ల ముంగిట ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ తో క‌లిసి తాప్సీ ప్ర‌చారం  హోరెత్తిస్తోంది. అదే క్ర‌మంలో తాప్సీ ముందే అనురాగ్ బిగ్ బూబ్స్ అంటూ కామెంట్ చేసాడు. అయితే ఆ సంద‌ర్భం కూడా అలా క‌లిసొచ్చింద‌ని చెప్పాలి. ఇటీవ‌ల దుమారం రేపిన‌ రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ ను చూడటం మీకు ఎలా అనిపించిందని  ఇంటర్వ్యూయర్ అనురాగ్ కశ్యప్ ను అడిగినప్పుడు ``వాస్తవానికి హాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ అలాంటి షూట్ లు చేయడం సర్వసాధారణమ``ని అనురాగ్ అన్నారు. ఇంత‌లోనే.. అనురాగ్ కూడా అలాంటి షూట్ లో పాల్గొనాల‌ని ఇంటర్వ్యూయర్ సలహా ఇవ్వడంతో దానికి ప్ర‌తిగా తాప్సీ స్పందిస్తూ..``ఓహ్ ప్రేక్షకులకు హార‌ర్ సినిమా చూపించొద్దు`` అని వ్యాఖ్యానించింది.

తాప్సీ మాటలకు ప్రతిస్పందించిన అనురాగ్ ``తాప్సీ కంటే పెద్ద b**bs  కలిగి ఉన్నందుకు అసూయపడుతోంది`` అని కామెంట్ చేసారు. దానికి  తాప్సీ కూడా ప‌క‌ప‌కా నవ్వేసింది. అయితే ఈ ఇంట‌ర్వ్యూ వీక్షించాక‌ ఎప్పటిలాగే కొంద‌రు ట్రోల‌ర్లు అనురాగ్ పై విరుచుకుప‌డ్డారు. త‌న‌ వ్యాఖ్యలు సెక్సిస్ట్ త‌ర‌హా అని వ్యాఖ్యానించారు. అయితే మరికొందరు ఆ కామెంట్ ని  సపోర్ట్ చేస్తున్నారు. ఇది కేవ‌లం సరదాగా సాగిన‌ ఇంటర్వ్యూ అని మ‌ద్ధ‌తుగా నిలిచారు.

న్యూడ్ ఫోటోషూట్ కెలుకుడు దేనికి?

బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ నెట్టింట ఎంత‌టి దుమారాన్నిరేపిందో తెలిసిందే. ఈ విషయంలో బాలీవుడ్ అంతా ర‌ణ‌వీర్ ని స‌పోర్ట్ చేస్తే..నెటిజ‌నులంతా ఓవైపు ఉండి వ్య‌తిరేకించారు. సినిమా వాళ్లంతా ఇలాంటివి చాలా కామ‌న్ అన్న‌ట్లుగా స్పందించ‌గా.. నెటిజ‌నుల్లో ఒక వ‌ర్గం మాత్రం దీనిని వ‌దిలిపెట్ట‌లేదు. ఎవ‌రి స్టైల్లో వాళ్లు చెల‌రేగారు. నెట్టింట జ‌రిగిన  ట్రోలింగ్ ప్ర‌హ‌స‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.  న్యూడ్ ఫోటోషూట్ తో ర‌ణ‌వీర్ కి ఓ కొత్త ఐడెంటిటీ ద‌క్కింది.  ఒకే ఒక్క న‌గ్న ఫోటోతో దుమారం రేపాడు. ర‌ణ‌వీర్ పై కోర్టు కేసుల సంగ‌తి అటుంచితే అత‌డికి బోలెడంత ప‌బ్లిసిటీ ద‌క్కింది.

తాజాగా  ఈ న్యూడ్ షూట్ వ్య‌వ‌హారాన్ని సొట్ట‌బుగ్గ‌ల తాప్సీ త‌న సినిమా ప్రచారం కోసం పీక్స్ లో ఉప‌యోగించుకుంటోంది. తాప్సీ ప్ర‌ధాన‌ పాత్ర‌ధారిగా అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్వ‌కత్వంలో  తెర‌కెక్కిన `దోబారా` ఈనెల 19న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆ ఇద్ద‌రూ మీడియా సంస్థ‌ల‌తో ఇంట‌రాక్ట్ అవుతున్నారు. దీనిలో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూయ‌ర్ అనురాగ్ ని  ర‌ణ‌వీర్ ని అలా న్యూడ్ ఫోటోషూట్ చ‌ర్చ సాగింది ``హాలీవుడ్ లో ఇలాంటి షూట్ లు చేయ‌డం చాలా సాధ‌ర‌ణం. ప్ర‌తీ ఒక్క‌రు వాటిలో నటిస్తారు. వివిధ భంగిమ‌ల్లో ఫోజులిస్తారు. అదేం కొత్త‌గా అనిపించ‌లేదు`` అని అనురాగ్ అన్నాడు. మీరు కూడా ఇలాంటి షూట్స్ చేయోచ్చు క‌దా! అని మ‌రో ప్ర‌శ్న వేయ‌గా  ఇంత‌లో తాప్సీ ఎంట‌ర్ అయి బోలెడంత మ‌సాలాను యాడ‌ప్ చేసింది. అనురాగ్ వెంట‌నే  తాప్సీ న‌న్ను చూసి అసూయ‌ప‌డుతుంది అనుకుంటా`` అంటూ న‌వ్వేయ‌డం అంతా జోవియ‌ల్ గా క‌నిపిస్తుందే కానీ ఎబ్బెట్టుగా అనిపించ‌దు.

కానీ నెటిజ‌నులు మాత్రం ఆ ఇద్ద‌రిని వ‌దిలి పెట్ట‌డం లేదు. అనురాగ్ ని `సెక్సిస్ట్`  అని కామెంట్  చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇంట‌ర్వ్యూ చివ‌ర్లోనే అనురాగ్ నోరుజారి దొరికిపోవ‌డంతో ట్రోలింగ్ బారిన ప‌డ్డారు. ఇలా వ్యాఖ్యానించ‌డంతో `దోబారా` నెట్టింట వైర‌ల్ గా మారింది. సినిమాకి కావాల్సినంత ప్రచారం దక్కుతోంది. 


Full View
Tags:    

Similar News