ఇళయరాజా మోసం చేశాడంటున్న హీరోయిన్

Update: 2016-03-06 09:28 GMT
ఈ ఇళయరాజా ఆ ఇళయరాజా కాదులెండి. ఇతను తమిళ సినీ పరిశ్రమలో హీరోగా రాణించాలని ఆశపడుతున్న కుర్ర హీరో. తనను పెళ్లి కూడా చేసుకుని.. ఇప్పుడు వేరే అమ్మాయితో ఇంకో పెళ్లికి రెడీ అయిపోతున్నాడంటూ ఈ ఇళయరాజా మీద ఆరోపణలు గుప్పిస్తూ హేమ అనే తెలుగు నటి మీడియా ముందుకొచ్చింది. ఈ అమ్మాయి తెలుగులో, తమిళంలో జూనియర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో కనిపించింది. ఓ తమిళ సినిమా షూటింగ్ సందర్భంగా ఇళయరాజాతో హేమకు పరిచయం ఏర్పడిందట. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. హైదరాబాద్ లో, చెన్నైలో ఇద్దరూ కలిసి ఉన్నారట కూడా.

రెండేళ్ల కిందటే వీళ్లిద్దరికీ పెళ్లయిందట. ఐతే ఇప్పుడు తన కంటే డబ్బున్న అమ్మాయి కనిపించగానే ఆమెతో పెళ్లికి రెడీ అయిపోతున్నాడని అంటోంది హేమ. ఆ అమ్మాయి ఇళయరాజా సోదరుడి మరదలని.. కుటుంబ సభ్యుల ప్రమేయంతో అతను ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని హేమ ఆరోపించింది. ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. ఇళయరాజా బంధువు ఒకరు పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నాడని.. అతడి పలుకుబడి కారణంగా పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని మీడియా ముందుకొచ్చి బోరుమంది హేమ. మీడియా వాళ్లయినా ఈ కేసు విషయంలో జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని హేమ కోరుతోంది.
Tags:    

Similar News