ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్లు 50 సినిమాలు చేస్తే ఆహా ఓహో అనేస్తున్నారు. అలాంటిది ఏకంగా వెయ్యి సినిమాలకు సంగీతాన్నందించడం.. ఆ వెయ్యి సినిమాల్లో కూడా క్వాలిటీ చూపించి భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప సంగీత దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకోవడం ఒక్క ఇళయరాజాకు మాత్రమే దక్కిన గౌరవం. ఈ లెజెండ్ త్వరలోనే తన 1000వ సినిమాకు సంగీతాన్నందించబోతుండటం విశేషం. తమిళంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆ సినిమాకు ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వం వహించబోతున్నాడు.
సుబ్రమణ్యపురం సినిమాతో దర్శకుడిగా పరిచయమై, ఆ తర్వాత హీరోగా మారిన శశికుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. శరత్ కుమార్ తనయురాలు వరలక్ష్మి కథానాయిక. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం ఇళయరాజా ఇప్పటికే పని మొదలుపెట్టారు. మరే మ్యూజిక్ డైరెక్టర్ కీ అందని మైలురాయిని అందుకోబోతున్నారు కాబట్టి ఆ సినిమాకు ఇళయరాజా అద్భుతమైన సంగీతాన్నందిస్తాడనడంలో ఎవరికీ సందేహాల్లేవు. ఇళయరాజా అంటే తెలుగు సంగీత ప్రియులకూ పిచ్చే కాబట్టి ఆ సినిమాను తెలుగులోనూ ఒకేసారి విడుదల చేస్తారట.