రజినీకాంత్, కమల్ హాసన్.. సౌత్ ఇండస్ట్రీ దిగ్గజాలు. ఐతే ఇద్దరి మధ్య వృత్తిపరంగా ఎంత పోటీ ఉన్నా.. ఇద్దరూ ఎప్పుడూ ఎంతో స్నేహంగానే మెలిగారు. బాలచందర్ శిష్యరికంతో సినిమాల్లో నిలదొక్కుకున్న ఈ దిగ్గజాలు ఎప్పుడు ఎక్కడ కలిసినా ఆ కార్యక్రమం చాలా ప్రత్యేకంగా మారిపోతుంది. ఇటీవల అమితాబ్, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా 'షమితాబ్'కు సంబంధించిన ప్రమోషన్లో భాగంగా అమితాబ్‌తో కలిసి రజినీ, కమల్ ఒకే వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు దిగ్గజాల గురించి సంగీత బ్రహ్మ ఇళయరాజా తన అభిప్రాయాలు వెల్లడించారు.
''రజినీకాంత్ అందరికీ మంచి నటుడిగానే తెలుసు. కానీ ఆయనలో మంచి దర్శకుడున్నాడు. ఆయన అద్భుతమైన స్క్రీన్ ప్లే రచయిత కూడా. మీ సినిమాలకు మీరే రాయచ్చు కదా అని చాలాసార్లు అన్నా. కానీ అది చాలా భిన్నమైన పని స్వామీ అంటూ నవ్వేశాడు. ఇక కమల్ విషయానికొస్తే ఆయనది బ్రహ్మాండమైన గొంతు. సంగీతంలోనూ, నటనలోనూ ఆయన గ్రహణ శక్తి అద్భుతం. మనతో జోకులేస్తూ ఉండే కమల్.. ఒక్కసారి దర్శకుడు యాక్షన్ అని చెప్పగానే ఆ పాత్రలోకి మారిపోయి అసాధారణంగా నటిస్తారు'' అని చెప్పారు రాజా.