ఇళయరాజా ఏదైనా సినిమాకు ఒప్పుకోవడమే మహా భాగ్యం. అలా ఒప్పుకుని సంగీతం అందించినా.. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ రావడం అరుదు. వచ్చినా నోరు తెరవరు. ఐతే డైరెక్టర్ రమేష్ వర్మ ఏం మ్యాజిక్ చేశాడో కానీ.. ఇళయరాజాను తన సినిమాకు ఒప్పించారు. ఆయనతో సంగీతం చేయించుకున్నాడు. పాటల వేడుకకు రప్పించాడు. అంతే కాదు ఆయనతో నాలుగు మాటలు మాట్లాడించాడు కూడా. ‘అబ్బాయితో అమ్మాయి’ ఆడియో ఫంక్షన్ కు తన పెద్ద కొడుకు కార్తీక్ రాజాతో కలిసి హాజరైన ఇళయరాజా.. ఈ వేడుకలో మైక్ అందుకుని నాలుగు మాటలు మాట్లాడ్డం విశేషం.
తాను సంగీతం అందించిన సినిమా లవ్ స్టోరీ కావడంతో ప్రేమ గురించి మాట్లాడారు ఇళయరాజా. ‘’ప్రతి ఒక్కరికీ ప్రేమంటే ఇష్టం. అందరూ ప్రేమలోనే ఉంటారు. నాకు సంగీతమంటే ప్రేమ, కొందరికీ డబ్బంటే ప్రేమ. ఇలా ప్రతి ఒక్కరూ ప్రేమలో ఉంటారు. రమేష్ వర్మ - నిర్మాతలు ప్రేమతో నిర్మించిన ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమా మంచి విజయాన్ని సాధించాలి. యూనిట్లోని అందరికీ ఆల్ ది బెస్ట్’’ అంటూ తనదైన శైలిలో ప్రసంగించారు ఇళయరాజా. తన తొలి సినిమా ‘ఒక ఊరిలో’కే ఇళయరాజాతో సంగీతం చేయించుకోవాలని చూశాడు రమేశ్ వర్మ. కానీ ఆయన ఒప్పుకోలేదు. తర్వాతి సినిమాలకు కూడా ట్రై చేసి.. ఎట్టకేలకు ఆయనతో మ్యూజిక్ చేయించుకున్నాడు.