హింస‌ను త‌గ్గించే స‌రికొత్త మందు

Update: 2015-11-23 04:55 GMT
మ‌న‌సుని - ఇంద్రియాల్ని పూర్తిగా అదుపులో ఉంచుకునేవాడు ఏదైనా సాధిస్తాడ‌ని మునులు చెప్పేవారు. పూర్వా కాలంలో ఆశ్ర‌మ విద్య‌లో ఇలాంటి పాఠాల్ని ఉద్భోధించేవారు. కానీ ఇప్పుడు లోకం మారిపోయింది. స్కూళ్లు - కాలేజీల్లో అంతా కార్పొరెట్ క‌ల్చ‌ర్ వేళ్లూనుకుంది. దీనివ‌ల్ల లాభం  కంటే న‌ష్ట‌మే ఎక్కువైపోతోంది.

ప్ర‌తి విద్యార్థి మెద‌డు కేవ‌లం సంపాద‌న కోసం చ‌దువు అన్న‌ట్టే త‌యార‌వుతున్నాయి. ఈ అవ్య‌వ‌స్థ వ‌ల్ల మ‌నిషిలోకి వికృత రూపం ప్ర‌వేశించి అత్యంత ప్ర‌మాద‌క‌రంగా  సిట్యుయేష‌న్ మారిపోయింది. ఒక‌రినొక‌రు చంపుకునేంత దుర్మార్గం పెరిగిపోయింది. ఇప్పుడున్న స‌మాజం అంతా క్రిమినల్స్‌ తో నిండిపోయింది. ప్ర‌తి నిమిషం ఏదో చోట క్రైమ్ గురించిన వార్త‌లు వినాల్సి వ‌స్తోంది.  అందుకే ఈ స‌మాజాన్ని మార్చాలంటే త‌న ద‌గ్గ‌ర ఓ శ‌క్తి వంత‌మైన‌ టానిక్ ఉంద‌ని చెబుతున్నారు మ్యాస్ర్టో ఇళ‌య‌రాజా. నాలుగున్న‌ర ద‌శాబ్ధాల సుద‌ర్ఘ అనుభ‌వం ఉన్నఈ సుస్వ‌ర‌ సంగీత మాంత్రికుడు సంఘంలోంచి హింస‌ను తొల‌గించాలంటే ఓ స‌రికొత్త మందును క‌నిపెట్టాన‌ని చెప్పారు. అస‌లు స్కూలు కెల్లే ప్ర‌తి బిడ్డా ముందుగా నేర్చుకోవాల్సింది సంగీతం. దాంతో దైవ‌త్వం వ‌స్తుంది. హింస‌ను జ‌యించ‌డం సాధ్య‌మ‌వుతుంది. అంటూ చెప్పుకొచ్చారు.

నిన్న‌టిరోజున గోవా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింఫెస్టివ‌ల్‌ లో ఈ మాట అన్నారాయ‌న‌. క‌ళాశాల‌ల్లో సంగీతాన్ని నిర్భంద విద్య‌గా ప్ర‌వేశ‌పెట్టాల‌ని డిమాండ్ సూచించారాయ‌న‌. వేలాది సుస్వ‌రాల్ని ఇప్ప‌టికే సృజించిన ఈ సంగీత‌కారుడు ఇప్ప‌టికీ సంగీత సాధ‌న‌లోనే నిత్య‌య‌వ్వ‌నుడిగా ఉండ‌డం వెన‌క అస‌లు ర‌హ‌స్యం అర్థ‌మైందా?
Tags:    

Similar News