ఇది సోషల్ మీడియా జెనరేషన్. ఈమధ్య కాలంలో ఫేస్ బుక్ కు కాస్త గిరాకీ తగ్గింది కానీ ఇన్స్టాగ్రామ్ పేరు మాత్రం మార్మోగిపోతోంది. డబ్బున్నోళ్ళందరూ జూబ్లీ హిల్స్ - బంజారా హిల్స్ లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నట్టుగా బ్యూటీలందరూ ఇన్స్టాగ్రామ్ లో చేరి వేల.. లక్షల.. కోట్ల ఫాలోయర్లతో దుమ్ము దులుపుతున్నారు. తాజాగా గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్ ఇన్స్టాగ్రామ్ లో అలాంటి ఘనత ఒకటి సాధించింది.
ఇలియానా ఫాలోయర్ల సంఖ్య 9 మిలియన్స్ దాటడంతో ఉబ్బితబ్బిబ్బైన ఇల్లీ బేబీ తన ఆనందాన్ని ఒక పాత ఫోటో పోస్ట్ చేసి మరీ పంచుకుంది. ఇంతకీ అది పాత ఫోటో అని ఎందుకని అనుమానం రాలేదా? ఇల్లీ బేబీ రీసెంట్ గా ముంబై లోని బాంద్రా ఏరియాలో కూరగాయలు కొంటూ కెమెరా కంటికి చిక్కింది. సాధారణంగా బక్కగా ఉండే భామ ఆ ఫోటోల్లో కాస్త బొద్దుగా కనబడేసరికి చాలా పుకార్లు వచ్చాయి. కొందరు ఆండ్రూ నీబోన్ తో పెళ్ళి తర్వాత కాస్త ఒళ్ళు చేసిందంటే మరికొందరు మాత్రం ప్రెగ్నెంట్ అయిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పెళ్ళిని అయితే దాచిపెట్టడం సాధ్యం కానీ ప్రెగ్నెన్సీ ని దాచిపెట్టడం కష్టం కదా అంటూ వాళ్ళే దీర్ఘాలు తీస్తున్నారు.
ఏదేమైనా ఇల్లీ బేబీ మాత్రం ఓల్డ్ ఫొటోగ్రాఫ్ ఇన్స్టా లో పోస్ట్ చేసిందన్న విషయం మాత్రం ఖాయమే. ఇక ఈ పాత ఫోటోకు '9 మిలియన్ లవ్.. యూ గైస్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పిక్ కర్టెసీ 'ఆండ్రూ నీబోన్' అని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోలేదండోయ్!