ఒకప్పుడు తెలుగులో స్టార్హీరోయిన్గా వెలిగిన గోవా బ్యటీ ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి వెనకబడిపోయింది. టాలీవుడ్లో అందాలను ఆరబోసి తెలుగు ప్రజలను ఫిదా చేసిన ఈ అమ్మడు బాలీవుడ్లో మాత్రం పోటీని తట్టుకోలేకపోయింది. తెలుగులో యువహీరోలందరితోనూ నటించింది. ఇటీవల మళ్లీ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ సాధించలేక పోయింది. కాగా సోషల్‌మీడియాలో మాత్రం ఆమెకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలియానా కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ గోవాబ్యూటీ పెట్టిన ఓ పోస్ట్ చేసిన ఫోటో అభిమానులను కంగారు పెట్టింది. ఇలియానా ప్రస్తుతం బల్వీందర్ సింగ్ జనుజ దర్శకత్వంలో రణ్‌దీప్ హుడాతో కలిసి ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్‌లీ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్ర షూటింగ్లో ఇలియానా చేతికి గాయం అయ్యింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన చేతి ఫోటోను షేర్ చేసింది. దీని ఫన్నీ గా కామెంట్ పెట్టింది. ‘రొమాంటిక్ కామెడీ సినిమా కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరు గాయపడతారు?’ అంటూ చమత్కరించింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఇటువంటి ప్రమోషన్లు చేసుకుంటున్నదని కొందరు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే బాలకృష్ణ కొత్త సినిమాలో ఇలియానా నటిస్తుందన్న వార్తలు వచ్చినప్పటికీ అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ బయటకు రాలేదు.