న‌డుము మ‌డ‌త‌ల్ని జూమ్ చేసి చూపించాలా ఇల్లీ?

Update: 2021-03-15 04:30 GMT
స‌న్న‌జాజి సోయ‌గం ఇలియానా సోష‌ల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లాక అక్క‌డ ఆశించిన కెరీర్ ద‌క్క‌క చాలా ప్ర‌యాస‌లు ప‌డుతున్న ఈ బ్యూటీ .. ప్ర‌స్తుతానికి సామాజిక మాధ్య‌మాల‌లో వాణిజ్య ప్ర‌క‌ట‌న ఆదాయంపై దృష్టి సారించింది.

ఈ వేదిక‌పై ఎంత‌గా అందాలు ఆర‌బోస్తే అంత‌గా ప్ర‌క‌ట‌న‌ల‌ ఆదాయం ద‌క్కుతోంది. దానికి త‌గ్గట్టే నిరంత‌రం బికినీలు .. స్విమ్ సూట్లతో వేడెక్కిస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది. ఇంత‌కుముందు గోవా బీచ్ విహారం స‌హా మ‌ల్దీవుల విహారం నుంచి ఫోటోల్ని  వీడియోల్ని షేర్ చేసిన ఇలియానా.. త‌న రెగ్యుల‌ర్ జిమ్ వ‌ర్క‌వుట్ల ఫోటోలు వీడియోల‌తోనూ బోలెడంత వైర‌ల్ అయిపోయింది.

ఇన్ స్టా వేదిక‌గా ఇలియానాకి భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. తాజాగా త‌న న‌డుము మ‌డ‌త‌ల్ని అక్క‌డ ట్యాన్ చార‌ల్ని చూపిస్తూ ఇచ్చిన ఫోజుపై తీవ్రమైన వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు అభిమానులు. అద్దంలో న‌డుముపై ఫ్యాట్ ని  ప‌రిశీలన‌గా చూసుకుంటోంది ఇలియానా. అయితే ఇల్లీకి మ‌రీ వెర్రి ఎక్కువ‌. మ‌రీ అంత‌గా జూమ్ చేసి చూపించాలా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు ఫ్యాన్స్. మ‌రీ ఇలియానాలో వ్యాపార ధృక్ప‌థం శ్రుతిమించుతోంద‌న్న ఆవేద‌న అభిమానుల్లో వ్య‌క్త‌మైంది. గోవా బ్యూటీ ఇక‌నైనా మారాల‌ని కూడా కొంద‌రు అభిమానులు సూచిస్తున్నారు. అభిషేక్ బ‌చ్చ‌న్ స‌ర‌స‌న ఇలియానా న‌టించిన ది బిగ్ బుల్ రిలీజ్ కి రావాల్సి ఉంది. అజ‌య్ దేవ‌గ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Tags:    

Similar News