ఆయనతో సాధ్యం కాదని లీవ్ ఇట్ అనేసారా?
బాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో ఆర్ బాల్కీ దర్శకత్వంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన `పా` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే
బాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో ఆర్ బాల్కీ దర్శకత్వంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన `పా` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. అమితాబ్ కెరీర్ లో మరో గొప్ప ప్రయోగాత్మక చిత్రం ఇది. ఇందులో అమితాబ్ వింత వ్యాధితో బాధపడే 12 ఏళ్ల బాలుడి పాత్రలో అమితాబచ్ అదరగొట్టారు. ఆపాత్రకు గానూ జాతీయ పురస్కారం అందుకున్నారు. అమితాబ్ కెరీర్ లోనే ది బె స్ట్ రోల్ గా నిలిచింది.
విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ చిత్రాన్ని అమితాబ్ తో తెరకెక్కించడం సాధ్యం కాదని ఆర్ బాల్కీ మొదటిలోనే నిలిపివేయాలని అనుకున్న సంగతి వెలుగులోకి వచ్చింది. అవును నిజం. ఈ విషయాన్ని బాల్కీ స్వయంగా రివీల్ చేసారు. `సినిమాలో అమితాబ్ ని చిన్నపిల్లాడి పాత్రలో చూపించడం మాకెంతో సవాల్ గా మారింది. ఈ సినిమా కోసం జన్యుపరమైన లోపం ఉన్న పిల్లలు ఎలా ఉంటారో పరిశోధన చేసాను.
ప్రత్యేకంగా లాస్ ఎంజెల్స్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ ను కూడా తీసుకొచ్చాను. సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తో చర్చించి అమితాబ్ లుక్ టెస్ట్ నిర్వహించాం. కానీ ఆయన హైట్ 6 అడుగులుపైనే ఉంటుంది. అంత పొడవు ఉన్న వ్యక్తిని చిన్నగా కుదించి చూపించడం సాధ్యం కాదనుకున్నాం. ఎందుకంటే అంత సాంకేతికత, డబ్బు మా దగ్గర లేవు. దీంతో సినిమా ఆపేయాలని నిర్ణయించుకున్నా. కానీ శ్రీరామ్ మాత్రం నా మాట వినలేదు. ఇంకొన్ని ప్రయోగాలు చేసి అమితాబ్ ని చిన్నపిల్లాడిగా మార్చారు. ఆ విషయంలో ఈ క్రెడిట్ అంతా శ్రీరామ్ కే ఇవ్వాలి` అని అన్నారు.
`పా` చిత్రాన్ని 17 కోట్ల తో నిర్మించగా 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం 2009లో రిలీజ్ అయింది. రిలయన్స్ సంస్థలు అమితాబచ్చన్ తో కలిసి నిర్మించాయి. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్, పరేష్ రావల్ కీలక పాత్రలు పోషించారు.