ఇలియానా... అంటే కనీకనిపించని నడుము. అందరినీ తన దాసుల్ని చేసుకున్న ఈ దేవి తెలుగు సినిమాను ఒక ఊపు ఊపింది. కందిరీగ నడము దానా అని మనం ఎప్పట్నుంచో పాటలు రాసుకుంటూ వస్తున్నా ఆ పాటకు ఇలియానా సార్థకతలా అనిపించింది. అలాంటి ఇలియానా కొంతకాలం కనుమరుగై సడెన్‌గా మెరిసిందిపుడు.
అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ప్రస్తుతం ఈమె హీరోయిన్. కానీ బొద్దుగుమ్మలను హీరోయిన్గా అస్సలు ఒప్పుకోని తెలుగు సినీ ప్రేక్షకులు ఇలియానా తాజా లుక్స్ చూసి షాక్ తినడమే తరువాయి. ఏంటి? ఈమె ఇలా తయారైంది? అసలు ఆమె ట్రేడ్ మార్క్ నడుము ఏదీ అని అడుగుతున్నారు. అంతేగా మరి... ఒకర్ని మనం ఏం చూసి ఇష్టపడ్డామో అదే వారిలో మిస్సయినపుడు ఎలా తట్టుకోగలం. ఇపుడు సినీ ప్రేక్షకుల పరిస్థితి కూడా ఇదే.
ఏ వుడ్ అయినా సినిమాకు గ్లామర్ చాలా ప్రధానం. ఒక్కో ఇండస్ట్రీకి తనదైన స్కిల్స్‌ను కోరుతుంది. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా గ్లామర్, నటన రెండింటినీ పుష్కలంగా కోరుకుంటుంది. మరి అది మిస్సయితే కష్టం కదా. తెలుగులో ఇప్పటివరకు ఇలా దేహు శుద్ధి లేని వారందరూ మాయమైపోయారు. చిరంజీవి వంటి వారితో చేసిన ఆర్తిఅగర్వాల్ కూడా ఒళ్లు పెంచడం వల్ల అవకాశాలు కోల్పోయి కెరీర్‌ను కోల్పోయింది. కాబట్టి ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అక్కడ అలా ఉండాలి - మెలగాలి.
చూద్దాం... తెలుగు ప్రేక్షకులు పెద్ద మనసు చేసుకుని ఇలియానాను ఆదరిస్తారేమో. అది జరిగితే కొత్త ట్రెండ్ మొదలైనట్లే.