సోషల్ మీడియాల్లో షికార్ చేసే కొన్ని గాసిప్స్ ని తట్టుకోవాలంటే కథానాయికలకు గుండె నిబ్బరం ఉండాలి. కొన్నాళ్లు అవి చూసి బాధపడినా ఆ తర్వాత నెమ్మదిగా అలవాటు పడిపోవాల్సి ఉంటుంది. ఇలియానా కూడా అలానే అలవాటు పడిపోయిందిట.
ఆండ్రూ నీబోన్ తో సహజీవనంలో ఉన్నప్పుడు తనపై బోలెడన్ని గాసిప్పులు షికార్ చేశాయి. వాటిపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. తాను గర్భవతి అని గర్భస్రావం జరిగిందని పుకార్లు వచ్చాయని చెప్పారు. తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు తప్పుడు కథనాలొచ్చాయని కూడా తెలిపారు. నిజానికి అలాంటి కథనాలు రాయడం విచారకరం. వింతగా రాస్తారు. నేను ఆత్మహత్యాయత్నం చేశాననే కథనాలు వచ్చాయి. నా పనిమనిషి ఈ వార్తను ధృవీకరించిందట. అసలు నాకు పనిమనిషి లేదు. నేను ఆత్మహత్యకు ప్రయత్నించలేదు.. నేను బతికే ఉన్నాను… అర్థంపర్థం లేని పుకార్లు షికార్ చేశాయి.. అన్నారు. ఇలాంటివి ఎలా పుడతాయో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రెండేళ్ల క్రితం ఇలియానా తన మొదటి బిడ్డను ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో ఆశిస్తున్నట్లు చాలా ఊహాగానాలు సాగాయి. అయితే తాను గర్భవతి కాదని ఇలియానా స్పష్టం చేసారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే ఇటీవలే ఇలియానా నటించిన ది బిగ్ బుల్ ఓటీటీలో రిలీజై ఆదరణ దక్కించుకుంది.