నా 12వ యేటనే ఆ విమర్శలు మొదలయ్యాయిః ఇలియానా

Update: 2021-04-28 03:41 GMT
దేవదాసు' ముద్దుగుమ్మ ఇలియానా ఇటీవల సినిమాల్లో కాస్త తక్కువగా కనిపిస్తుంది. ఉత్తరాదిన నాలుగు అయిదు సంవత్సరాలు వరుసగా బిజీ హీరోయిన్ గా సినిమాలు చేసిన ఇలియానా ఆ తర్వాత అక్కడ ఆఫర్లు తగ్గిపోవడంతో సౌత్‌ కు వచ్చే ప్రయత్నం చేసింది. సౌత్‌ లో కూడా ఈమెను పెద్దగా పట్టించుకోలేదు. తెలుగులో ఈమె రీఎంట్రీ ఇచ్చిన సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ తెలుగు సినిమా ల్లో ఈమెకు ఆఫర్ వచ్చిందే లేదు. ప్రస్తుతం హిందీలోనే ఒకటి రెండు చిన్నా చితకగా ప్రాజెక్ట్‌ లను చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలపై జనాల్లో పెద్దగా ఆసక్తి అయితే లేదు. కాని సోషల్‌ మీడియాలో ఈమె పెట్టో పోస్ట్‌ లు మరియు హాట్‌ ఫొటో లపై మాత్రం ఆసక్తి కలిగి ఉన్నారు అనడంలో సందేహం లేదు.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా పోస్ట్‌ లు పెట్టే ఈ అమ్మడు రెగ్యులర్ గా బాడీ షేమింగ్ విమర్శలు ఎదుర్కొంటుందట. ఇలియానా బ్యాక్ గురించి ఎంతో మంది బ్యాడ్‌ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇలియానా ఆ విషయాన్ని గురించి చెప్పుకొచ్చింది. ఈ బాడీ షేమింగ్ ట్రోల్స్ అనేవి ఈమద్య వస్తున్నవి కావని చెప్పుకొచ్చింది. తాను 12 ఏళ్ల వయసు లో ఉన్నప్పటి నుండే మొదలు అయ్యాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత కూడా చాలా మంది నన్ను బాడీ షేమింగ్‌ తో విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇప్పటికి నా సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా నా బాడీ షేమింగ్‌ గురించి 10 మెసేజ్ లు వస్తూనే ఉంటాయి. వాటిని చూసినప్పుడు మొదట్లో కోపం అనిపించేది కాని ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది. నా గురించి తప్పుగా మాట్లాడే వారిని పట్టించుకుంటే నేను ముందుకు వెళ్లలేను అని నాకు అర్థం అయ్యింది. అందుకే బ్యాడ్‌ కామెంట్స్ గురించి పట్టించుకోకపోవడం మంచిదని నేను నిర్ణయించుకున్నాను అంది.
Tags:    

Similar News