హాలీవుడ్ నటులు, భార్యాభర్తలైన ఎమ్మా పోర్ట్‌నర్, ఇలియట్ పేజ్ విడాకులు తీసుకోబోతున్నారు! మూడేళ్ల క్రితం ఒక్కటైన వీరిద్దరూ.. తమ వివాహ బంధానికి చట్ట ప్రకారం ముగింపు పలకబోతున్నారు. ఈ విషయాన్ని వీరు సంయుక్తంగా వెల్లడించారు. మ్యాన్‌హట్టన్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశామని ప్రకటించారు.
ఈ సందర్భంగా పేజ్ మాట్లాడుతూ.. ''ఎంతో సుదీర్ఘ ఆలోచనలు.. చర్చ తర్వాత మేం ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. మేం విడాకులు తీసుకుని విడివిడిగా బతకాలని నిర్ణయించుకున్నాం. కానీ మా మధ్య స్నేహం, ఒకరి పట్ల ఒకరికి గౌరవం అలానే కొనసాగుతాయి. మేం బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటాం'' అంటూ ఉమ్మడి ప్రకటించిందీ జంట.
ఏడాది పాటు డేటింగ్ చేసిన తర్వాతే 2018లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి విషయాన్ని కూడా కొద్ది రోజుల పాటు గోప్యంగా ఉంచిన ఈ జంట.. తర్వాత బహిర్గతం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మూడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ అంతే ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇదిలాఉంటే.. పేజ్ 2014లోనే తనని తాను 'గే' అని ప్రకటించుకున్నారు. కాగా.. తాజాగా పేజ్ తనను తాను ట్రాన్స్‌మ్యాన్‌గా అంగీకరించారు. ఈ మేరకు పేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చారు. ''నేను ఎవరనేది గుర్తించాను. నన్ను నేను గొప్పగా ప్రేమిస్తున్నాను. నా పట్ల నాకున్న ఈ ప్రేమ ఎంత గొప్పదో వ్యక్తపర్చడానికి మాటలు చాలవు. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన నమ్మశక్యం కాని వ్యక్తులందరికీ కృతజ్ఞతలు.'' అంటూ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పేజ్‌కి ఎమ్మా పోర్టనర్ మద్దతు తెలిపారు. ''పేజ్ లాంటి వ్యక్తులు దేవుడిచ్చిన బహుమతి. వారిని గౌరవించాలి. వారి ప్రైవసీకి భంగం కలిగించకూడదు'' అంటూ సపోర్ట్ చేయడం విశేషం. ఈ విధంగా వారు పరస్పరం అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రపంచానికి తెలియజేశారు.