మనిషి ప్రకృతిని నాశనం చేస్తే.. నిధి కోసం సహజసిద్ధంగా జీవించే ఒక జాతిని అంతం చేయాలనుకుంటే పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో అవతార్ సినిమాలో చూపించారు జేమ్స్ కామెరూన్. మనిషి అడుగుపెట్టిన ప్రతిచోట సర్వనాశనం తప్ప ఇంకేమీ మిగలదనే సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చారు ఈ సినిమాలో. శ్రీరాముని స్ఫురద్రూపం.. ఆంజనేయుని తోకను జోడించి ఒక లార్జర్ దేన్ లైఫ్ పాత్రను క్రియేట్ చేసి ఆ గ్రహం అంతా అలాంటి పాత్రలే ఉంటే ఎలా ఉంటుందో ఊహించారు. ఆ గ్రహానికి పండోరా అంటూ అందమైన పేరును పెట్టారు. ఇప్పుడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అడవి గ్రీనరీ నేపథ్యంలో మహేష్ కథానాయకుడిగా ఓ సినిమా తీయడానికి కూడా అవతార్ - పండోరా ప్రేరణ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రపంచ సినీమేధావులు అవతార్ రిలీజ్ వేళ ఆ మూవీపై కవితాత్మకంగా విశ్లేషించి తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. అవతార్ కోసం ఎగ్జయిట్ అయినంతగా వేరొక సినిమా గురించి ఎవరూ ఎగ్జయిట్ కాలేదు. అంతటి ప్రభావవంతమైన ఫ్రాంఛైజీ ఇది. ఈ ఏడాది డిసెంబర్ లో అవతార్ 2 వస్తోంది అనగానే ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులతో పాటు కామన్ ఆడియెన్ కూడా అంతే ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇటీవలే తొలి టీజర్ ట్రైలర్ గ్లిమ్స్ రిలీజ్ కాగానే ఎంతో ఉత్కంఠగా దానిని వీక్షించారు.
ఈసారి మునుపటి కంటే పెద్ద కాన్వాస్ తో కామెరూన్ నీటి అడుగున యుద్ధాలను చూపించబోతున్నారని అర్థమైంది. నీటి అడుగున భూమి పైనా గాల్లో కూడా వార్ ఎంత భీకరంగా ఉందో అవతార్ 2లో చూపించబోతున్నారు. ఇక్కడ కూడా అవతార్ ల మనుగడ ప్రశ్నార్థకం అయ్యే క్రమంలో తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. ఈసారి నీటిలో సంచరించే భారీ జీవాలను కూడా చూపిస్తున్నారు. పచ్చదనం కొండలు కోనలు వాగులు వంకలతో పాటు ఇప్పుడు నీటి అడుగున చిత్రవిచిత్రమైన అందాలను తెరపై ఆవిష్కరించబోతున్నారు.
తాజాగా అవతార్ ఐమ్యాక్స్ ట్రైలర్ ని విడుదల చేయగా అది ఎంతో మనోహరంగా ఆకట్టుకుంది. మరోసారి విజువల్ వండర్ ని కామెరూన్ చూపించబోతున్నారని అర్థమవుతోంది. ట్రైలర్ పండోరా లో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇందులో ఎంతో ప్రకాశవంతమైన నీలి జలాలు ప్రకృతి అందంగా కనిపిస్తున్నాయి. మొదటి భాగం నుండి ఎగిరే జీవులు టోరుక్ .. మొదటిసారిగా కొత్త తిమింగలం ని కూడా ఆవిష్కరించారు. డిసెంబర్ రాక కోసం ఇప్పటి నుంచే అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. తొలి రోజే ఈ సినిమాని థియేటర్లలో వీక్షించాలన్న ఆసక్తి ట్రైలర్లతో కలిగింది. భాషా భేధం లేకుండా అన్ని భాషల్లో ఈ మూవీ రిలీజ్ కి వస్తుంది గనుక తెలుగులోనూ అవతార్ ని వీక్షించే వెసులుబాటు ఉండనుంది.
అవతార్ రికార్డులు బ్రేక్ చేయాలంటే..?జేమ్స్ కామెరూన్ అవతార్ ట్రైలర్ గురించి చర్చిస్తుండగానే.. ఈ ఫ్రాంఛైజీ నుంచి వరుసగా సినిమాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ లో పార్ట్ 2 Avatar: The Way Of Water విడుదల కానుంది. ఇటీవల సినిమా కాన్ ఉత్సవాల్లో అవతార్ 2 టీజర్ ని విడుదల చేసారు. ది వే ఆఫ్ వాటర్ నాలుగు అవతార్ సీక్వెల్ లలో ఒకటి .. ఈ సంవత్సరం డిసెంబర్ 16న ఈ మూవీ విడుదల కానుంది. డిస్నీ మార్వెల్ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ కి జోడించి విడుదల చేసిన ట్రైలర్ కి ఐమ్యాక్స్ ట్రైలర్ భిన్నంగా ఉంది. మొదటి సీక్వెల్ జేక్ సుల్లీ- నవీ నెయిటిరి వారి కుటుంబం ప్రమాదాల నుంచి కాపాడుకునేందుకు సరికొత్త ప్రాంతాన్ని సెర్చ్ చేయడం టీజర్ లో కనిపించింది.
జేమ్ కామెరూన్ అవతార్ 2009లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 2.84 బిలియన్ డాలర్ల (సుమారు 30వేల కోట్లు)తో బాక్సాఫీస్ వద్ద ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత అవెంజర్స్ - ఎండ్ గేమ్ టాప్ 2లో నిలిచింది. అవతార్ - ద వే ఆఫ్ వాటర్స్ మరోసారి సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.