మహేష్ లాగా సబ్టిల్ యాక్టింగ్ తో మెప్పించడం అంత ఈజీ కాదు బాసూ..!

Update: 2022-05-01 06:30 GMT
టాలీవుడ్ లో సబ్టిల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించి.. ఆ సినిమాలతోనే బ్లాక్ బస్టర్స్ అందుకునే హీరో ఎవరైనా ఉన్నారంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి. 'శ్రీమంతుడు' 'భరత్ అనే నేను' 'మహర్షి' వంటి సినిమాలలో మహేష్ చాలా కూల్‌ గా, కామ్‌ గా కనిపిస్తారు.

ఆ సినిమాల్లో విలన్ కు వార్నింగ్ ఇచ్చే సీన్ అయినా ఓవర్ రియాక్ట్ అవ్వకుండా.. కూల్ గా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ - ఎక్స్‌ ప్రెషన్స్ తో సబ్టిల్ గా యాక్టింగ్ చేస్తారు మహేష్. అవి హిట్ అవడమే కాదు.. మహేష్ నటనకి అవార్డులు - ప్రశంసలు తెచ్చిపెట్టాయి.

నిజానికి ఇలాంటి పాత్రలు మనం హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. సబ్టిల్ నటనతో మెప్పించడం అంత ఈజీ కాదు. 'జనతా గ్యారేజ్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి తరహా యాక్టింగ్ తో తన సత్తా చాటారు.

తారక్ జనరల్ గా తన సినిమాల్లో ఫుల్ హైపర్ గా గట్టిగా గట్టిగా డైలాగ్స్ చెబుతూ.. ఎంతో ఆవేశంతో ఎమోషన్స్ పండిస్తూ ఉంటారు. కానీ 'జనతా గ్యారేజ్' సినిమాలో దానికి పూర్తి భిన్నంగా అతని పాత్ర ఉంటుంది.

మహేష్ ఐనా తారక్ అయినా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన సినిమాలలోనే ఇలా సబ్టిల్ గా సెటిల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అది కొరటాల శైలి. ఆయన సినిమాల్లో హీరో పాత్ర తీరుతెన్నులు.. స్వభావం అలానే ఉంటాయి.

ఇప్పుడు లేటెస్టుగా కొరటాల దర్శకత్వంలో రూపొందిన 'ఆచార్య' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సైతం సబ్టిల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ను అలరించడానికి ప్రయత్నించారు. కాకపోతే ఇది సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టఫ్ గా మారింది.

చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే మిశ్రమ స్పందన వచ్చింది. ఇలాంటి టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందనే చర్చ జరుగుతోంది.

అదే సమయంలో ఈ సినిమాలో బిగ్ బాస్ మరీ డల్ గా కనిపించడం పై మెగా ఫ్యాన్స్ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా చిరంజీవి తన సినిమాల్లో ఉత్సాహభరితమైన నటనతో ఆకట్టుకుంటూ ఉంటారు. కామెడీ టైమింగ్.. ఎమోషన్స్.. డ్యాన్సులు.. ఫైట్లతో మ్యాజిక్ చేస్తుంటారు.

కానీ ‘ఆచార్య’ సినిమాలో ఇలాంటి అంశాలన్నీ మిస్ అయ్యాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చిరు నటనలో ఎక్కడా మునుపటి ఉత్సాహమే కనిపించలేదు. దీనికి కారణం మెగాస్టార్ శైలిని పక్కనపెట్టి కొరటాల స్టైల్ లోకి మారిపోవడమే అనిపిస్తుంది.

చిరంజీవి సైతం ఇటీవల పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొరటాల హీరోల శైలిలో నటించడానికి, సంభాషణలు పలకడానికి ట్రై చేశానని తెలిపారు. కాకపోతే చిరు పాత్ర మరియు సబ్టిల్ నటన ఫ్యాన్స్ కు రుచించట్లేదు.

చిరు మరీ నీరసంగా కనిపించారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'దొంగ మొగుడు' 'రౌడీ అల్లుడు' 'శంకర్ దాదా ఎంబీబీఎస్' తరహా స్క్రిప్టులలో చిరంజీవి ని చూడాలని ఆశ పడుతున్నారు. 'గాడ్ ఫాదర్' సినిమాతో అభిమానులను మెప్పించి.. మెగాస్టార్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
Tags:    

Similar News