కియారా దృష్టిలో ఓటీటీ..థియేట‌ర్ రిలీజ్ ఒక్క‌టేనా?

Update: 2022-11-26 02:30 GMT
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ కెరీర్  దేదీప్య‌మానంగా సాగిపోతుంది. ఓవైపు హిందీ సినిమాలు చేస్తూనే మ‌రోవైపు పాన్ ఇండియా చిత్రాల్లోనూ అవ‌కాశాలు అందుకుంటుంది. ఈ ఏడాది బాలీవుడ్ స‌క్సెస్ ఫుల్ బ్యూటీగా కియారా పేరు మ‌రింత ఫేమ‌స్ అయింది.  అలియాభ‌ట్ 'గంగూబాయి క‌తియావాడి' లాంటి చిత్రంతో స‌త్తా చాటితే.. కియారా బ్యాక్ టూ బ్యాక్ విజ‌యాలు అందుకుని వెండి తెర‌ని మురిపించింది.

ఇక ఆర్సీ 16 లో ఛాన్స్ అందుకుని ఏకంగా దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తోనే ప‌నిచేసే అరుదైన అవ‌కాశం ఒడిసి ప‌ట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే అమ్మ‌డు జాతీయ స్థాయిలో ఫేమ‌స్ అయిపోతుంది. కియారా సైతం చాలా కాన్పిడెంట్ గా ఉంది. తాజాగా ఈ బ్యూటీ ఓటీటీ..థియేట‌ర్ మ‌ధ్య వ్య‌త్యాసం గురించి ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌రంగా స్పందించింది.

ఆ రెండింటి గురించి నేను పెద్ద‌గా ప‌ట్టించుకోను. నేను నటించిన సినిమా ఏ వేదిక‌పై రిలీజ్ అయినా నాకు ఒక్క‌టే. నా దృష్టిలో రెండు స‌మాన‌మే. పాత్ర‌కు న్యాయం చేసానా లేదా?  ఎలాంటి క‌థ‌లో న‌టించాను అన్న విష‌యాల గురించే ఆలోచిస్తాను. నా సినిమా ఎక్క‌డ రిలీజ్ అవుతుంద‌న్న‌ది ఎప్పుడూ ఆలోచించ‌లేదు.  నేను న‌టించిన 'గోవింద నామ్ మేరా' ఓటీటీలో రిలీజ్ కానుంది.

హాస్య ప్ర‌ధానంగా సాగే చిత్ర‌మిది.  కొన్ని పాత్ర‌లు అన్నిసార్లు మ‌న వ‌ద్ద‌కురావు. అలాంటివి వ‌చ్చిన‌ప్పుడు వ‌దులుకోకూడ‌దు.  ఒప్పుకున్నా అలాంటి పాత్ర‌ల ద్వారా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డం అంత సుల‌భం కాదు. అందులో చాలా క‌ష్టం ఉంటుంది. వాటిని అనుభ‌వించిన వాళ్ల‌కే తెలుస్తుంది'  అని తెలిపింది.

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో 'స‌త్య ప్రేమ్ కి క‌థా' లో న‌టిస్తోంది. అలాగే రామ‌మ్ చ‌రణ్ స‌ర‌స‌న పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తుంది. ఇంకా బ్యూటీకి తెలుగులో స్టార్ హీరోల‌తో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కానీ  హిందీ సినిమాలే క‌మిట్ అవుతుంది. అక్క‌డ క్రేజీ బ్యూటీగా  వెలిగిపోవ‌డంతో తొలి ప్రాధాన్య‌త అక్క‌డే ఇస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News