దొందలు, వెయ్యి నోట్ల రద్దు సంగతేమో కానీ.. ఈ దెబ్బకి టాలీవుడ్ జనాలు చాలామంది వణికిపోతున్న పరిస్థితి. భారీ వసూళ్లు.. రికార్డు కలెక్షన్స్.. వందల కోట్ల కొల్లగొట్టడాలు అన్నీ కబుర్లకే మినహాయిస్తే.. లెక్కల్లోకి చూపడం లేదనే సంగతి ఇన్ కం ట్యాక్స్ వారి దెబ్బకి తేలిపోతోంది. బాహుబలి నిర్మాతల్లో ఒకరి దగ్గర దాదాపు 60 కోట్ల రూపాయలు పెద్ద నోట్లు దొరికాయనే వార్తలు టాలీవుడ్ ని కలవరపెట్టేస్తున్నాయి.
అన్ని ఏరియాల్లోనూ రికార్డు రేట్లకు అమ్మడమే తప్ప.. దానికి గాను పన్నులు కట్టడం లేదన్నదే ఐటీ వారి అనుమానం. ఇక్కడ బైటపడ్డ సమాచారంతో.. ఇఫ్పుడు ఇతర విభాగాల్లోకి కూడా దూసుకుపోయేందుకు ఐటీ డిపార్ట్ మెంట్ నిర్ణయించింది. పెద్ద సినిమాలు ఓవర్సీస్ హక్కులను భారీ రేట్లకు విక్రయించడం చూస్తూనే ఉన్నా.. ఇందులో కూడా మతలబులు జరుగుతున్నాయని అనుమానిస్తోంది ఈ విభాగం. 10-15 కోట్లకు హక్కులు విక్రయించినా సరే.. పేపర్లపై మాత్రం నామమాత్ర రేట్లతో సరిపెట్టేసి పన్నులు ఎగ్గొడుతున్నారన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
శాటిలైట్ రూపంలో కూడా ఇలాంటి పనులే చేస్తున్నారట. నోట్ల రద్దు దగ్గర నుంచి జరుగుతున్న లావాదేవీల నిగ్గు తేల్చడానికి ఐటీ అధికారులు లేటెస్ట్ టెక్నాలజీ వినియోగించి దాడులు చేసేస్తున్నారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న ఈ సమస్య గురించి మాట్లాడేందుకు.. ఒక్క బడా నిర్మాత కూడా సాహసించలేకపోవడాన్ని ఇక్కడ గమనించచ్చు.