తొలి ఇండియన్ సూపర్ గర్ల్ 'ఇంద్రాణి' యాక్షన్ షురూ..!

Update: 2022-03-31 13:32 GMT
సూపర్ హీరోల - సూపర్ గర్ల్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ దక్కుతుంది. అలాంటి సినిమాలు ఎక్కువగా హాలీవుడ్ లో రూపొందుతుంటాయి. భారత సినీ పరిశ్రమలో కూడా కొన్ని సూపర్‌ హీరోస్‌ సినిమాలు వచ్చాయి. కానీ ఇంతవరకు సూపర్‌ గర్ల్‌ పాత్రతో తెరకెక్కిన సినిమాలు రాలేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు ఇప్పుడు ''ఇంద్రాణి'' అనే సినిమా రాబోతోంది.

'ఇంద్రాణి' అనేది భారతదేశపు మొట్ట మొదటి సూపర్ గర్ల్ మూవీ. తెలుగులో కూడా ఇలాంటి సినిమా రూపొందడం ఇదే తొలిసారి. తెలుగు తెరపై గతంలో ఎప్పుడూ చూడని విభిన్నమైన కథాంశంతో భారీ స్థాయిలో ఈ అడ్వెంచరస్ మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. యాక్షన్‌ సన్నివేశాలతో పాటు కమర్షియల్‌ హంగులు జోడించనున్నట్లు పేర్కొన్నారు.

ఇటీవల విడుదల చేసిన 'ఇంద్రాణి' మోషన్ పోస్టర్‌ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో యానియా భరద్వాజ్ - ప్రణీత బిజినా కీలక పాత్రలు పోషిస్తుండగా.. అత్యంత శక్తివంతమైన విలన్‌ ఎలక్ట్రో మ్యాన్‌ గా కబీర్ దుహన్ సింగ్ నటిస్తున్నారు. గరీమా కౌశల్ - షతప్ అహ్మద్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

హైదరాబాద్ లో 'ఇంద్రాణి' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సినిమా వీఎఫ్‌ఎక్స్‌ పనులను పక్కాగా ప్లాన్‌ చేశారు. ఈ మూవీ విడుదలైన తర్వాత సూపర్ గర్ల్ ఇంద్రాణి క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటారని.. ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా తెరకెక్కిస్తున్నామని దర్శక, నిర్మాత స్టీఫెన్ పేర్కొన్నారు.

'ఇంద్రాణి 'ని పక్కా మాస్ మార్వెల్ మూవీగా అభివర్ణించిన దర్శకుడు.. నెలల తరబడి ఆడిషన్స్ - మల్టిపుల్ లుక్ టెస్ట్‌ల తర్వాత యానియా భరద్వాజ్ ని ప్రధాన పాత్రలో నటించడానికి ఎంపికయ్యారని తెలిపారు. ఇంద్రాణి మల్టిపుల్ షేడ్స్ ఉన్న చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ అని.. దీనికి యానియా ప్రొఫైల్ సరిగ్గా సరిపోతుందన్నాడు.

ఈ సినిమా కోసం యానియా మార్షల్ ఆర్ట్స్‌ లో శిక్షణ పొందింది తీసుకుందని.. యాక్షన్ ఎపిసోడ్స్‌ లో ఆమెను చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారని స్టీఫెన్ తెలిపారు. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టాన్లీ సుమన్ బాబు దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. చరణ్ మాధవనేని ఈ చిత్రానికి డీఓపీగా పని చేస్తుండగా.. చోటా కె ప్రసాద్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎడిటింగ్ బాధ్యతను తీసుకున్నారు. రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తుండగా.. ప్రేమ్సన్ యాక్షన్ డిజైన్ చేయనున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 'ఇంద్రాణి' సినిమా రూపొందుతోంది.

Full View
Tags:    

Similar News