టాలీవుడ్ లో ఉన్న టాప్ లీగ్ కమెడియన్స్ లో వెన్నెల కిషోర్ ఒకరు. ఈ జెనరేషన్లో ఉన్న ఇతర కమెడియన్లకు వెన్నెల కిషోర్ కు ఉన్న ఒక ప్రధానమైన తేడా ఏంటంటే వెన్నెల కిషోర్ కామెడీ లో ఒక క్లాస్ టచ్ ఉంటుంది. అందుకే ఈ జెనరేషన్ యూత్ కు వెన్నెల కిషోర్ కు ఫేవరెట్ కమెడియన్. మరో ముఖ్యమైన తేడా ఏంటంటే.. 'నేను హీరోగా సినిమా చెయ్యను' అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్ కూడా కిషోర్ ఒక్కరే. ఒక్క సినిమాలో కమెడియన్ గా క్లిక్ అయితేనే చిరంజీవి.. బాలకృష్ణ స్టైల్ లో మాస్ హీరోల అవతారమెత్తే టాలీవుడ్ లో ఇలా చెప్పడం విశేషమే.
ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు వెన్నెల కిషోర్. తనకు చదువుకునే వయసులో పెద్ద క్లారిటీ ఉండేది కాదని.. గోల్స్ ఉండేవి కాదని ఓపెన్ గా చెప్పాడు. మొదట్లో తనంతట తనే ఎంపీసి గ్రూప్ లో చేరానని ఒక ఏడాది తర్వాత అది నచ్చక.. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాయలేదన్నాడు. ఇంట్లో ఆవిషయం చెప్తే ఒక్కరూ తనను ఒక్కమాట కూడా అనలేదని అన్నాడు. నిజానికి ఇంట్లోవాళ్ళు తను ఫుల్ గా తిడతారని అనుకున్నాడట. మరేం చేస్తావని మాత్రం అడిగారట. బైపీసి లో చేరతానని చెప్తే అందులో చేర్పించారట. అప్పుడే కిషోర్ వాళ్ళ నాన్నగారికి "నేను బైపీసి చేరుతున్నానంటే డాక్టర్ అవుతున్నాని నువ్వు ఫిక్స్ అయిపోవద్దు.. ఇంటర్ అయిన తర్వాత ఆ సంగతి చెప్తా" అని క్లారిటీ ఇచ్చాడట. ఎంసెట్ కు కోచింగ్ తీసుకొని కూడా ఎగ్జామ్ రాయలేదట. అప్పుడు కూడా తన పేరెంట్స్ ఏమీ అనలేదని చెప్పాడు. ఇంటర్ అయిన తర్వాత ఈజీగా ఉంటుందని బీకామ్ లో చేరానని చెప్పాడు.
బీకాం తర్వాత మళ్ళీ గోల్ లేకుండా ఉండేవాడినని.. ఎంబీఎ చేద్దామనుకంటే వర్క్ అవుట్ కాలేదని అన్నాడు. అప్పట్లో "ఇండియా నాకు సూటబుల్ కంట్రీ కాదు. ఎందుకో నా టాలెంట్ కు ఇండియా లో వ్యాల్యూ లేదు" అనుకునే వాడిని. కిషోర్ పద్దతి ఇలా ఉండడంతో వీడితో లాభం లేదు అన్నట్టుగా కిషోర్ అక్కవాళ్ళు డిసైడ్ అయ్యారట. "మా అక్క పిల్లలు నాకంటే పెద్దవాళ్ళు. నేను ఇలా తిరుగుతూ ఉండేసరికి 'వాడితో తిరగకు నువ్వు.. వాడికి గోల్ లేదు' అనే టైపులో చెప్పేవాళ్ళు. 'వాడితో వర్క్ అవుట్ కాదు' అంటూ నాకు దూరంగా ఉంచేవాళ్ళు. దాంతో 'వీళ్ళందరికీ నేనంటే ఏంటో చూపించాలి' అని నేను అనుకునేవాడిని. అలా చేయాలంటే నేను ఫారెన్ వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో ఉండకూడదు. బైటకెళ్ళి అక్కడ ఏం పని చేసినాగానీ 'వాడు ఫారెన్ లో ఉన్నాడురా' అని ఇక్కడోళ్ళు అనుకుంటారు కదా అందుకే ఫారెన్ వెళ్ళాలని గోల్ పెట్టుకున్నా. అదీ నా ఫస్ట్ గోల్."
ఆ తర్వాత ఆస్ట్రేలియా.. న్యూజీల్యాండ్.. అమెరికా ఇలా వీటిలో ఏదో ఒక కంట్రీ కి వెళ్ళాలని అనుకున్నాడట. అమెరికాపై అసలు హోప్స్ లేవు కానీ లక్కీ గా వచ్చిందట. అక్కడ స్టడీస్ పూర్తి చేశాడట. "నాకు జావా బాగా వచ్చు. చెప్తే మీరు నమ్మరు గానీ నేను జావా ట్యూషన్స్ చెప్పేవాడిని. అలా తెలియకుండానే నేను జావా డెవలపర్ అవుతానని మనసులో అనుకున్నా." అ తర్వాతకాలంలో ఎన్నో పరిణామాలు జరిగి ఆ జావా డెవెలపర్ కాస్తా టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా మారిపోయాడు.