ఇంద్రగంటి కెరీర్లో ఒకే ఒక రిగ్రెట్

Update: 2018-06-17 07:10 GMT
తెలుగులో గొప్ప పరిజ్ఞానం, మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. బాగా చదువుకుని సినిమాల్లోకి అడుగుపెడితే.. ఔట్ పుట్ఎలా ఉంటుందో  ఇంద్రగంటి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. తొలి సినిమా ‘గ్రహణం’ నుంచి.. లేటెస్ట్ మూవీ ‘సమ్మోహనం’ దాకా ప్రతి సినిమాలోనూ తన స్థాయి ఏంటో చూపించాడు ఇంద్రగంటి. కమర్షియల్‌ గా ఎలాంటి సక్సెస్‌ లు అందుకున్నాడన్నది పక్కన పెడితే.. ప్రేక్షకుల నుంచి చాలా గౌరవం సంపాదించాడాయన. అంతగా ఆడని కొన్ని సినిమాలు కూడా ఇంద్రగంటికి మంచి పేరే తెచ్చిపెట్టాయి. ఐతే ఇంద్రగంటి తీసిన వాటిలో ఒక్క సినిమా మాత్రం ఆయనకు అన్ని రకాలుగా నిరాశను మిగిల్చింది. అదే.. బందిపోటు. ఈ సినిమా విషయంలో తాను ఎప్పటికీ రిగ్రెట్ అవుతానని అంటున్నాడాయన.

తాను తీసిన సినిమాలకు సంబంధించి తాను ఎక్కువగా బాధపడింది ‘బందిపోటు’ సినిమాకే అని ఇంద్రగంటి చెప్పాడు. తాను ఆ సినిమాను ఇంకా బాగా తీసి ఉంటే దానికి అలాంటి ఫలితం వచ్చేది కాదని చాలా ఆలోచించినట్లు ఇంద్రగంటి చెప్పాడు. ఐతే ఏదైనా సినిమా నిరాశ పరిచినపుడు తనకు సాహిత్యమే సాంత్వన ఇస్తుందని.. ‘బందిపోటు’ తర్వాత కూడా సాహిత్యం చదివే మళ్లీ ఉత్తేజితుడినయ్యానని ఇంద్రగంటి చెప్పాడు. తన సినిమా బాగా ఆడకపోతే తాను చేసిన తప్పులేంటో కాగితం మీద రాసుకుంటానని.. తర్వాతి ప్రాజెక్టులో ఆ తప్పులు జరగకుండా చూసుకుంటానని అన్నాడు. తన తొలి సినిమా ‘గ్రహణం’ సమయానికి తన మీద తనకు ఎన్నో సందేహలుండేవని.. అసలు తాను సినిమా తీయగలనా లేదా అని సందేహించేవాడినని.. ఇప్పుడు తానున్న స్థితికి చాలా సంతోషిస్తున్నాని.. ఇంద్రగంటి సినిమాలు ఇలా ఉంటాయి అని ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు వచ్చిందని.. ఆ గుర్తింపు కొనసాగేలా సినిమాలు తీయాలనుకుంటున్నానని ఆయన చెప్పాడు.
Tags:    

Similar News