పోస్టర్ టాక్: చరిత్రలో కలిసిన నిజం

Update: 2017-06-06 12:24 GMT
ఇటు విమర్శకులను మెప్పిస్తూ.. అటు కమర్షియల్ సక్సెస్ సాధించడం సినిమా తీయడం తేలికేం కాదు.  సొసైటీలో ఉన్న చీకటి కోణాలనే వెలుగులోకి తెచ్చి వాటిని సినిమాగా తీసి మెప్పించిన నేటి తరం డైరెక్టర్లలో మాధుర్ భండార్కర్ ముందుంటాడు. రీసెంట్ గా వచ్చిన క్యాలెండర్ గర్ల్, హీరోయిన్ కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా మాధుర్ పేరు నిలబెట్టాయి. ప్రస్తుతం మాధుర్ తన నెక్ట్స్ ఫిలింలో చరిత్రలో కలిసిపోయిన నిజాన్ని వెలికి తీస్తున్నారు. ఇందు సర్కార్ పేరిట ఎమర్జెన్సీల కాలం నాటి ఓ మహిళ గాథతో ‘సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.

975-77 మధ్య ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జన్సీ విధించింది. 21 నెలలపాటు దేశంలో చీకటి పాలన కొనసాగింది. ఇందు సర్కార్ సినిమా పోస్టర్ లోనే ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టారు. వీధుల్లో పోలీసుల వీరంగం...బిక్కుబిక్కుమంటూ ఉన్న ఇద్దరు చిన్నారులు ఉన్న ఈ పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ లో పార్లమెంటు భవనం కనిపిస్తోంది. ఈ సినిమాలో లీడ్ రోల్ లో కీర్తి కుల్హరి (పింక్ మూవీలో ముస్లిం గాళ్‌ రోల్ చేసిన అమ్మాయి) నటిస్తోంది. పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడే ధీరోదాత్త మహిళగా ఆమె కనిపించనుంది. ‘‘సిస్టంకు వ్యతిరేకంగా.. దేశం కోసం’’ అని సినిమాకు క్యాప్షన్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్విట్టర్ లో షేర్ చేసిన మాధుర్ భండార్కర్ ప్రపంచాన్ని మార్చేందుకు ఓ మహిళ కావాలంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మాధుర్ భండార్కర్ చాందినీ బార్ నుంచి ఒక కొత్త ఇష్యూతోనే సినిమా తీసుకుంటూ వచ్చాడు. ఆయన తీసిన పేజ్-3, ట్రాఫిక్ సిగ్నల్ కు బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డులు వచ్చాయి. ఇంతవరకు ఆయన తీసినవన్నీ కరెంట్ ఇష్యూలు కాగా.. తొలిసారి పీరియాడికల్ డ్రామా తీస్తుండటం విశేషం. ఈ సినిమా కోసం బాలీవుడ్ లో ఒకనాటి గొప్ప సంగీత దర్శకులైన అనుమాలిక్, బప్పీలహరి తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. ఇందు సర్కార్ జులై 28న థియేటర్లకు రానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News