ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోయిన్ లు వున్నా సినిమా ప్రమోషన్స్ కోసం వారిని భరించడం నిర్మాతలకు భారంగా మారుతోంది. ప్రమోషన్స్ కి స్టార్ హీరోయిన్ బయటికి రావాలంటే ప్రత్యేకంగా ఓ వెమికిల్ ని అరేంజ్ చేయాలి. తన మేకప్ టీమ్ తో పాటు పర్సనల్ టీమ్ కు కూడా భారీగా ఖర్చు చేయాలి. కనీసం డే ఖర్చు లక్షకు మించే వుంటోంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి గురించి ఇండస్ట్రీ వర్గాల్లో యునానిమస్ టాక్ వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. రానా, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ 'విరాట పర్వం'. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏడాది కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ ఎట్టకేలకు జూన్ 17న థియేటర్లలోకి రాబోతోంది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ ఈవెంట్ లతో రచ్చ రచ్చ చేస్తోంది. ఇప్పటికే వరంగల్ లో భారీ ఈవెంట్ ని నిర్వహించిన చిత్ర బృందం రిలీజ్ టైమ్ దగ్గరపడటంతో మరింత జోరు పెంచేసింది.
ఈ మూవీ కోసం మిగతా హీరోయిన్ లకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ గత వారం రోజుల నుంచి హైదరాబాద్ లో క్యాంప్ పెట్టేసింది. వరుస ఈవెంట్ లలో పాల్గొంటూ హల్ చల్ చేస్తోంది. ఈ నెల 17న 'విరాటపర్వం' విడుదలవుతున్న నేపథ్యంలో పలు మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాని అగ్రెసీవ్ గా ప్రమోట్ చేస్తోంది. సాయి పల్లవి ప్రమోషన్స్ కి తగ్గట్టే నిర్మాతలు కూడా ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అంటూ ప్రచారం చేస్తున్నారు.
గతంలో నానితో కలిసి నటించిన 'శ్యామ్ సింగరాయ్' మూవీ ప్రమోషన్స్ కోసం పది హేను రోజులు కేటాయించిన సాయి పల్లవి అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రమోషన్స్ అంటే ఎక్స్ ట్రా పేమెంట్ అంటూ ఇబ్బందులు క్రియేట్ చేస్తున్న ఈ రోజుల్లో సాయి పల్లవి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ రెండు వారాల పాటు సినిమా ప్రమోషన్స్ కోసం కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఇలా మరే హీరోయిన్ ఇలా నిర్మాతలకు, సినిమాకు సపోర్ట్ గా నిలబడటం లేదు.
సినిమా ప్రమోషన్స్ కోసం 2 నుంచి 3 రోజుల కేటాయించడానికే స్టార్ హీరోయిన్ లు ముఖం చాటేస్తుంటే సాయి పల్లవి మాత్రం ఎలాంటి కండీషన్స్ పెట్టకుండా సినిమా ప్రమోషన్స్ కోసం రెండు వారాలు కేటాయిస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటుండటం, అదనపు మొత్తాన్ని ప్రమోషన్స్ కోసం ఇవ్వాల్సిందే నని నిర్మాతలని ఇబ్బందులకు గురిచేయకపోవడం నిజంగా అభినందనీయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
మిగతా హీరోయిన్ లు సినిమా ప్రమోషన్స్ కోసం తమ వెంట అథిక సంఖ్యలో సిబ్బందిని వెంట తెచ్చుకుంటూ భారీగా వసూలు చేస్తుంటే సాయి పల్లవి మాత్రం తన వెంట ఒకే ఒక్క అసిస్టెంట్ ని తెచ్చుకుంటూ ఎలాంటి ఇబ్బందికరంగా వ్యవహరించకపోవడం నిజంగా విశేషం.
ప్రత్యేక కార్లని కూడా డియాండ్ చేయకుండా అనుకున్న టైమ్ కు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సాయి పల్లవి ఇప్పడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. దీంతో ఇండస్ట్రీ వర్గాలు సాయి పల్లవిని యునానిమస్ గా నిర్మాతల హీరోయిన్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.