టైటిల్ మారిస్తే తెలుగు టీజరేనా!?

Update: 2016-07-02 05:43 GMT
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇరుమగన్. ఈ సినిమాపై కోలీవుడ్ లో చాలానే అంచనాలు ఉన్నాయి. ఈ మధ్య విక్రమ్ సినిమాలు తెలుగులో అంతగా ఆడకపోవడంతో.. రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడం లేదు. గతేడాది వచ్చిన 10 ఎన్రాదుకుళ్ల అయితే అసలు తెలుగు డబ్బింగ్ కూడా చేయలేదు. ఈసారి ఇరుమగన్ లో నయనతార- నిత్యామీనన్ లు హీరోయిన్ గా నటించడం..వాళ్లిద్దరికీ ఇక్కడ మంచి క్రేజ్ ఉండడంతో.. తెలుగు వెర్షన్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పుడీ ఇరుమగన్ కి తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. సైమా అవార్డ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ టీజర్ లాంఛింగ్ జరిగింది. దీన్ని చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. అసలు ఎక్కడా ఒక్క డైలాగ్ కూడా ఉండదు. మ్యూజిక్ హంగామా తప్ప మాట వినిపించదు. తమిళ్ టీజర్ కి.. తెలుగుకు తేడా కూడా లేదులెండి. చివర్లో ఇంకొక్కడు అంటూ తెలుగు ఇంగ్లీష్ భాషల్లో వేసిన కార్డ్ తప్పిస్తే.. తెలుగు టీజర్ అనుకోవడానికి ఇంకేమీ లేదు. అంటే తెలుగు టీజర్ కోసం పెద్దగా దృష్టి పెట్టినది ఏం లేదనే విషయం స్పష్టమైపోతుంది.

ఇరు మగన్ అంటే రెండు ముఖాలు ఉన్నవాడు అని అర్ధం. దీని తెలుగు వెర్షన్ కి టైటిల్ డిసైడ్ చేయడమే చాలా లేట్ అయింది. ఇప్పుడు తెలుగు టీజర్ అంటూ 3-4  రోజుల ముందు నుంచి హంగామా చేసి.. చిరు చేతుల మీదుగా లాంఛ్ చేయించి.. చివరకు పేరొక్కటి మార్చి విడుదల చేయడం చూస్తుంటే.. ఈ నిర్మాతలకు తెలుగు వెర్షన్ పై ఎంత చిన్నచూపో అర్ధం చేసుకోవచ్చు.
Full View

Tags:    

Similar News