40 వ‌చ్చేస్తున్నాయ్.. పెళ్లెప్పుడు అమ్మ‌డూ?

Update: 2020-07-17 05:30 GMT
నాలుగు ప‌దుల వ‌య‌సుకు  చేరువ‌లో ఉంది క‌త్రిన కైఫ్. బాలీవుడ్ ని అగ్ర క‌థానాయిక‌గా ఏలిన క్యాట్ ఈ ఏజ్ లోనూ ఇంకా టీనేజ‌ర్ నే అనుకుంటోంది. కాలం వేగంగా ప‌రిగె‌డుతోంది. చూస్తుండ‌గానే అంతా అయిపోతోంది. నిరంత‌రం ఫిట్ నెస్ ని కాపాడుకుంటూ బాలీవుడ్ క్రేజీ సినిమాల్లో న‌టిస్తున్నా.. ఇంకా ఏదో లోటు అంటూ స‌మాజం చూసే చూపు వేరు. స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న వ‌రుస ప్రాజెక్టుల‌కు క‌మిటవుతూ.. మ‌రోవైపు త‌న ఫేవ‌రెట్ యంగ్ హీరో విక్కీ కౌశ‌ల్ తో ప్రేమాయ‌ణం సాగిస్తూ జోష్ కంటిన్యూ అవుతున్నా.. అంద‌రినీ వెంటాడే సందేహం ఆమె పెళ్లి.

నిన్న‌టితో 37 ఏళ్లు నిండాయి. 38 వ‌య‌సు అంటే ఓసారి ఆలోచించాలి. అయినా ఇంకా ఎన్నాళ్లు కుర్ర హీరోతో ల‌వ్వాయ‌ణం? ప‌్ర‌స్తుతం ఒంటరి కానే కాదు. అందుకే పెళ్లెప్పుడు? అంటూ అభిమానులు ర‌క‌ర‌కాల సందేహాల్ని వెలిబుచ్చారు. సోష‌ల్ మీడియాల్లో ఆ మేర‌కు డిబేట్ సాగింది. సుశ్మితా సేన్ లా.. జ‌య‌ప్ర‌ద‌లా చేస్తుందా ఏమిటి?

త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా క‌త్రిన త‌న సోద‌రి ఇస‌బెల్లాతో క‌లిసి ముంబై బాంద్రాలోని త‌న ఖ‌రీదైన విల్లాలోనే సెల‌బ్రేష‌న్స్ చేసుకుంది. ఇంకా ఎన్నాళ్లు సిస్ట‌ర్ తోనే కాపురం?  ప్రేమించిన వాడినే పెళ్లాడి కాపురం పెట్టేయొచ్చు క‌దా? అన్న ప్ర‌శ్న ఎదురైంది ఈ బ‌ర్త్ డే వేళ‌. ఇంకా ఎన్నాళ్ల‌ని అభిమానులు కూడా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు మాత్ర‌మే చెప్పాలి. పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు చెప్పే టైమ్ రాదా?
Tags:    

Similar News