టాప్ స్టోరి: `బొమ్మ` పడ్డాక బావురుమ‌న్నారు!

Update: 2020-12-04 10:23 GMT
ఎనిమిది నెల‌లుగా ఉపాధి క‌రువై థియేట‌ర్ రంగ కార్మికులు తిండికి లేని బ‌తుకు ఈడ్చాల్సి వ‌చ్చింది. ఈ రంగంలో వేలాది మంది రోడ్డున ప‌డ్డారు. అయితే ఎట్ట‌కేల‌కు కరోనా క‌ష్టాలు నెమ్మ‌దిగా తొలగిపోతాయ‌న్న న‌మ్మ‌కం పెరుగుతోంది. జ‌నంలో ఆందోళ‌న త‌గ్గి మ‌న‌సు కుదుట‌ప‌డుతోంద‌ని చెప్పాలి.

ఇక ఈ లాక్ డౌన్ లో ఎనిమిది నెల‌ల పాటు థియేట‌ర్లు మూసేయ‌డం తో కార్మికుల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌య్యాయి. ఇప్ప‌టికి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌డంతో ఇరు తెలుగు రాష్ట్రాల‌లో థియేట‌ర్లు తెరుస్తున్నారు. నేటి నుంచి హైద‌రాబాద్ మ‌ల్లీప్టెక్సులు తెరుచుకోగా వీటిలో జ‌నంతో క‌ళ నెల‌కొంది. మ‌హేష్ ఏఎంబీ మాల్ .. ప్రసాద్స్ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్, ... పంజాగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్ రీ ఓపెన్ అయ్యాయి.

కోవిడ్ నిబంధ‌న‌ల్ని అనుస‌రిస్తూ స‌గం సీట్ల‌నే భ‌ర్తీ చేయ‌డంతో ఇన్ సైడ్ సంద‌డి క‌రువైంది. ఇక‌పోతే థియేట‌ర్ అనుభ‌వం వేరే అంటూ ఎంజాయ్ చేసేందుకు వ‌చ్చిన వారిలో ఫియ‌ర్ ఫ్యాక్ట‌ర్ త‌గ్గిన‌ట్టుగానే క‌నిపిస్తోంది. ఇన్ని రోజుల తర్వాత తమకు దేవాలయం వంటి థియేటర్లు పునఃప్రారంభం కావడంతో పనిచేసే సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. క్రిస్మస్ నుంచి కొత్త సినిమాలు విడుదలకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ క్రిస్మ‌స్ కానుక‌గా సాయి తేజ్ `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే నోలాన్ టెనెట్ రిలీజై ఆడుతోంది.
Tags:    

Similar News