`మళ్లీ రావా` చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు గౌతమ్ తిన్ననూరి. రెండో ప్రయత్నమే `జెర్సీ` లాంటి క్రీడానేపథ్యం ఉన్న సినిమాని తెరకెక్కించి గట్స్ ఉన్న కుర్రాడు అనిపించారు. అతడు ద్వితీయ విఘ్నం అనే సెంటిమెంట్ ని అధిగమించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. జెర్సీ చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై క్రిటిక్స్ యునానిమస్ గా ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా పలువురు స్టార్లు గౌతమ్ పనితనాన్ని ఆకాశానికెత్తేశారు. ఇలాంటి ప్రయత్నం చేయడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసలింతకీ జెర్సీ చిత్రానికి స్ఫూర్తి ఏమిటి? అని దర్శకుడు గౌతమ్ తిన్ననూరిని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఇంట్రెస్టింగ్. `మళ్లీ రావా` తర్వాత ఏ సినిమా చేయాలి? అనుకున్నప్పుడు ఏదైనా స్ఫూర్తినిచ్చే సినిమా చేయాలనుకున్నా. క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే అహ్మదాబాద్ లో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్న మాట నాలో స్ఫూర్తి నింపింది. ఆయన సచిన్ గురించి ఓ గొప్ప మాట చెప్పారు. సచిన్ టెండూల్కర్ అంతటి ప్రతిభావంతులు ఎందరో ఉన్నా సచిన్ మాత్రమే అంత ఎత్తుకు ఎందుకు ఎదిగాడు? అంటే `సచిన్ లోని యాటిట్యూడ్` అందుకు కారణం అని అన్నారు. ఆ మాట నుంచే స్ఫూర్తి పొందాననని గౌతమ్ తెలిపారు. సచిన్ కంటే గొప్ప ప్రతిభ ఉన్న వాళ్లు ఎందరో. వారే ఈ కథకు స్ఫూర్తి. ప్రతిభావంతులు ఎందరు ఉన్నా కాలం కలిసి రాక మరుగున పడినవాళ్లే కదా! అలాంటి ఓ కుర్రాడి కథను ఫిక్షనల్ గా తెరపై చూపాను అని అన్నారు.
ఇది రంజీ ప్లేయర్ రమణ లాంబ జీవిత కథ నుంచి స్ఫూర్తి పొందారట కదా? అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని తెలిపారు. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ లైఫ్ నుంచి స్ఫూర్తి పొందారా? అంటే .. ఆయన కథ తెలియదని అన్నారు. క్రిస్ గేల్ లైఫ్ స్టోరి ఇంట్రెస్టింగ్. అతడికి హార్ట్ లో ఒక రంధ్రం ఉంది. దానివల్ల అతడు వరుసగా పది సిక్సర్లు కొట్టినా ఏమాత్రం ఎమోషన్ అవ్వడు. మూడు పరుగులు ఎప్పుడూ క్రీజులో తీసిందే లేదు.. నాని పాత్రకు స్ఫూర్తి ఉందా? అని ప్రశ్నిస్తే.. నాని మూడు పరుగులు చేశాడు కదా.. అన్నారు. జెర్సీ కథ కోసం ఎక్కువ రోజులు పని చేశాను. స్టోరి బోర్డ్ సహా ప్రతిదీ స్పష్టంగా రాసుకున్నా అని తెలిపారు. ఇంత పెద్ద సక్సెస్ రిలీజ్ ముందే ఊహించారా? అంటే అస్సలు ఊహించలేదని అన్నారు. ఇంతమంది నమ్మేశారు ఆ నమ్మకం ఏం అవుతోందోనన్న టెన్షన్ రిలీజ్ ముందు ఉండేది. ప్రస్తుత ఫలితం సంతోషాన్నిచ్చింది. వారం రోజుల పాటు కన్ఫ్యూజన్ లోనే ఉంటాను. జనంలో నిరూపించుకున్నాం కాబట్టి సంతోషంగా ఉంది.. అని గౌతమ్ అన్నారు.