కోట్లాది మంది భారతీయుల ఆస్కార్ కల నెరవేరే సమయం దగ్గర పడిందా? .. ఇండియన్ సినిమా ఆస్కార్ వేదికగపై తన సత్తాని చాటుకోబోతోందా?.. అంటే సినీ అభిమానులు అవుననే సాధానం చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి కలిసి నటించిన విజువల్ వండర్ 'RRR'. దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
విదేశీ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించి ప్రశంసలు దక్కించుకుంటున్న 'RRR' పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ పలు ప్రతిష్టాత్మక పురస్కారాలని సొంతం చేసుకుంటూ ఇంటర్నేషనల్ అవార్డుల రేసులో దూసుకుపోతోంది. రీసెంట్ గా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయిన 'RRR' త్వరలో ఈ అవార్డుల్ని కూడా తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఆస్కార్ అకాడమీ అవార్డులకు నామినేట్ కావడం గ్యారెంటీ అనే వాదనలు వినిపిస్తున్నాయి.
అస్కార్ అకాడమీ వారి దృష్టిని ఆకర్సించడం కోసం గత కొంత కాలంగా రాజమౌళి భారీ స్థాయిలో లాభీయింగ్ ని జరిపిన విషయం తెలిసిందే. ఇందు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాజమౌళి ఎలాగైనా RRR ని ఆస్కార్ బరిలో నిలపాలని విశ్వప్రయాత్నాలు చేస్తున్నాడు. ఇందుకు ఊతమిస్తూ పలు అంతర్జాతీయ అవార్డుల్లో RRR సత్తా చాటుతూ ఆస్కార్ పై ఆశలు రేకెత్తిస్తోంది.
2023 మార్చి 12న లాస్ ఏంజీల్స్ లోని డాల్బీ థియేటర్ సాక్షిగా అత్యంత అట్టహాసంగా ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ వేడుక జరగబోతోంది. ఇందు కోసం పలు సినిమాలు పోటీపడుతున్నాయి. మన దేశం నుంచి ఇప్పటికే గుజరాతీ మూవీ 'ఛల్లో షో'ఆ ఆస్కార్ కు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన దేశం నుంచి అధికారికంగా RRR ఆస్కార్ కు నామినేట్ కాకున్నా రాజమౌళి చేసిన కృషి వల్ల ఆస్కార్ దృష్టిని ఆకర్సించడంలో సఫలం అయింది.
ఇదిలా వుంటే RRR ఆస్కార్ కలపై రేపు అంటే గురువారం క్లారిటీ వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. గురువారం ప్రతీ విభాగం నుంచి 15 సినిమాలను షార్ట్ లిస్ట్ చేసి ప్రకటించ నున్నారట. అంతే కాకుండా జనవరి 23న వీటిని మరింతగా షార్ట్ లిస్ట్ ప్రతీ విభాగం నుంచి ఐదు సినిమాలను ఫైనల్ చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో మరి ఈ షార్ట్ లిస్ట్ లో RRR స్థానాన్ని దక్కించుకుంటుందా? .. ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది భారతీయుల కలని నిజం చేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.