సలార్‌ క్రేజ్‌ మరింత పెంచే 'విలన్‌' గాసిప్‌

Update: 2021-05-24 04:30 GMT
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ మూవీ షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. తదుపరి షెడ్యూల్‌ కు వెళ్లేందుకు సిద్దం అవుతూ ఉండగా కరోనా లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచి పోయింది. షూటింగ్‌ నిలిచి పోయినా కూడా సినిమా గురించిన పుకార్లు మాత్రం సోషల్‌ మీడియాలో కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న కేజీఎఫ్‌ 2 సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్ దత్‌ విలన్ గా కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాల్లో విలన్‌ లుగా బాలీవుడ్‌ స్టార్స్ ఉంటే సినిమా రేంజ్ మరింతగా పెరుగుతుందనేది కొందరి వాదన. అందుకే ప్రశాంత్ నీల్‌ కేజీఎఫ్‌ 2 లో మాదిరిగా సలార్‌ లో కూడా బాలీవుడ్‌ స్టార్ ను విలన్ గా దించబోతున్నట్లుగా తెలుస్తోంది.

సలార్‌ సినిమా పై ఇప్పటికే సౌత్‌ తో పాటు నార్త్‌ లో కూడా క్రేజ్ ఉంది. అలాంటి క్రేజీ మూవీలో బాలీవుడ్‌ స్టార్స్ ను దించితే మరింతగా సినిమా స్టార్‌ డమ్ పెరుగుతుందనేది ప్రశాంత్ నీల్‌ భావిస్తున్నాడని.. అందుకే ఈ సినిమా కోసం బాలీవుడ్‌ స్టార్ హీరో జాన్ అబ్రహం ను విలన్‌ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్‌ పై నమ్మకం మరియు ప్రభాస్‌ స్టార్‌ డమ్ నేపథ్యంలో ఆయన ఈ సినిమా లో విలన్ గా నటించేందుకు ఖచ్చితంగా ఒప్పుకుంటాడనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ సంప్రదించడమే ఆలస్యం ఎవరైనా తప్పకుండా ఒప్పుకుంటారు. జాన్ అబ్రహం కూడా సలార్‌ కు ఒప్పుకునే అవకాశాలున్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ పుకార్ల లో నిజం ఎంత ఉందో కాని సినిమా లో జాన్ అబ్రహం నటిస్తే మాత్రం ఖచ్చితంగా మరింత క్రేజ్‌ పెరగడం ఖాయం అంటున్నారు. సలార్‌ సినిమా తో ప్రభాస్ కన్నడ ప్రేక్షకులకు ఈసారి మరింత దగ్గర అవ్వబోతున్నాడు. అన్ని భాషల్లో కూడా సలార్‌ సాలిడ్ వసూళ్లను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. శృతి హాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News