ఇటీవల మెగా వర్సెస్ నందమూరి ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. కేసీఆర్ .. జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీపై నటసింహా బాలకృష్ణ నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. ఆ కలయిక భూములు పంచుకునేందుకే!! అంటూ అసందర్భంగా వివాదాస్పద వ్యాఖ్య చేయడంపై పరిశ్రమలో వాడి వేడిగా చర్చ సాగింది. ఆ తర్వాత మెగా బ్రదర్ లైన్ లోకి వచ్చి బాలయ్యకు కౌంటర్ ఇచ్చిన సంగతి విధితమే.
కేసీఆర్- తలసానితో చిరంజీవి భేటీకి తనను పిలవలేదని బాలయ్యబాబు ఆరోపించారు. వారి కలయికను సందేహించారు. వివాదానికి తెర తీశారు. నేడు (జూన్ 9) జరగనున్న ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్.. సినీపెద్దల భేటీకి సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఎవరో ఓ పెద్దాయన్ని తనవద్దకు పంపించారని బాలయ్యబాబు ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంతో ఇంకా మెగా వర్సెస్ నందమూరి వార్ కి తెరపడలేదనే అర్థమైంది.
ఇలాంటి వివాదాల సమయంలోనే బాలయ్య బర్త్ డేకి సమయం ఆసన్నమైంది. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా వేడుకల కోసం అభిమానులు ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. ఇది అసలే షష్ఠిపూర్తి (60వ) బర్త్ డే కాబట్టి బాలకృష్ణ కుటుంబీకులు అభిమానులు ప్రత్యేక విందుకోసం ప్లాన్ చేశారట. ఈ బర్త్ డే విందుకు సినీపెద్దలతో పాటుగా.. మెగాస్టార్ చిరంజీవిని బాలకృష్ణ ఆహ్వానిస్తారా ఆహ్వానించరా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.
అదే సమయంలో బాలయ్య బర్త్ డేని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తారా లేదా? జూన్ 10 సస్పెన్స్ కి తెర దించుతారా లేదా? అన్న చర్చా మెగా ఫ్యాన్స్ లో వేడెక్కిస్తోంది. పరిశ్రమలో సాటి హీరోల బర్త్ డేలు సహా ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు మెగాస్టార్ ప్రత్యేకించి శుభాకాంక్షలు చెబుతున్నారు. బాలకృష్ణ బర్త్ డేకి ఇలాంటి ఒక సందేశం ఇస్తారా లేదా? అన్నది ఆసక్తిగా మారింది.
సోషల్ మీడియాలో చిరంజీవి టైమ్ లైన్ సందేశాలు ఎంతో ఛమత్కారంతో.. చక్కని వ్యంగ్యంతో .. ఫన్నీగా అలరిస్తుంటాయి. పుట్టినరోజు సందేశాలు ఇతరులతో ఆయన అనుబంధాన్ని వెల్లడించే విధంగా ఉంటుంది. జూన్ 10న బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారనే భావిస్తున్నారంతా. బాలయ్య మనస్తత్వం గురించి చిన్నపిల్లాడిలా ఉంటుందని ఇది వరకూ ఓ సందర్భంలో చిరు వ్యాఖ్యానించారు. అలాగే ఆయన ఏనాడూ ఎవరి వ్యాఖ్యల విషయంలోనూ తనలోని ప్రశాంతతను కోల్పోలేదు. వ్యక్తిత్వాన్ని వదులుకో లేదు. చిరు స్వభావాన్ని విశ్లేషిస్తే బాలయ్య పై చక్కిలిగింతలు పెట్టే సందేశం జూన్ 10న ఫస్ట్ అవర్ లో చిరు సోషల్ మీడియాల టైమ్ లైన్ లో ప్రత్యక్షమవుతుందనే భావిస్తున్నారు. ఆ క్షణం కోసమే ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు.