టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ 5 హీరోల్లో ఒకరిగా ఎదిగిన సంగతి తెలిసిందే. తనదైన యూనిక్ స్టైల్ డ్యాన్సులు ఎనర్జీతో అతడు తనకంటూ ఓ ప్రత్యేకతను ఆపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్పతో తన స్థాయిని మరింతగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నాడు. పాన్ ఇండియా కాంపిటీషన్ లో ప్రభాస్ కి ధీటుగా ఎదిగేందుకు ప్రణాళికలు వేస్తున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రచయిత బివిఎస్ రవి స్వయంగా బన్ని గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. బన్ని బాగా కష్టపడి పని చేసే నటుడే కాదు.. ప్రతిసారీ యూనిక్ నెస్ కోసం ప్రయత్నిస్తారు. డ్యాన్సుల్లోనూ ప్రత్యేకత చూపిస్తారు. అదనపు హార్డ్ వర్క్ తో తన అన్ని చిత్రాలకు కొత్తగా ప్రయత్నిస్తాడు. అయితే బన్ని ప్రయత్నం వెనక అసలు కారణాన్ని రచయిత బీవీఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పరుగు (2008) సమయంలో బన్ని చేసిన ప్రయత్నాలను చూసి ఆశ్చర్యపోయి తనను ఎగ్జయిటింగ్ గా ప్రశ్నించానని ఆయన తెలిపారు. అల్లు అర్జున్ తన లక్ష్యాన్ని చేరుకునే వరకు తనకు తానుగా సంతృప్తి చెందడని..చంచలత అనేది తనలో ఉండదని తెలిపారు. పనిలో అతడు ఎప్పుడూ అలసిపోడని వెల్లడించారు. అసలు మీ లక్ష్యం ఏమిటి? అని ప్రశ్నించగా.. నంబర్ వన్ హీరో కావాలని బన్ని చెప్పారట. చేసే పనిని అంకిత భావంతో చేయడం లక్ష్యం చేరుకునేవరకూ చంచలత్వం చూపించకపోవడమే బన్ని విజయానికి కారణాలు అని బీవీఎస్ తెలిపారు. బన్ని నటిస్తున్న పుష్ప మొదటి భాగం దసరాకి విడుదలవుతుంది. పుష్ప రెండో భాగం వచ్చే ఏడాది చివరిలో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.