ఎంకి చావు సుబ్బికొచ్చిన చందంగా.. మీటూ ఉద్యమం పర్యవసానం మామూలుగా లేదండోయ్! ఇది కేవలం లైంగిక వేధింపులపై దాడితో సరిపెట్టుకోలేదు. ఇప్పుడు హాలీవుడ్‌లో వేరొక కొత్త సిస్టమ్ కి పురుడు పోస్తోంది. ఇకపై ఆన్ లొకేషన్ శృంగార సన్నివేశాలు తెరకెక్కిస్తే అక్కడ ఆ సీన్స్ వరకూ ఘటైన శ్రుతి మించిన వ్యవహారం నడవకుండా అడ్డు కట్ట వేసేందుకు ఒక ఇంటిమసీ కోఆర్డినేటర్ ఒకరిని అపాయింట్ చేస్తున్నారట. అది ఏ సినిమా అయినా సరే.. అక్కడ ఆ టైపు సీన్లు తెరకెక్కిస్తే గనుక కచ్ఛితంగా సదరు ఉద్యోగిని నియమించుకోవాల్సి ఉంటుందిట.
ఇదివరకటిలా పెదవి ముద్దులు జుర్రేయడానికి - ఘాటైన బెడ్ రూమ్ సన్నివేశాల్లో చెలరేగిపోవడానికి.. జ్వాలలు రగిల్చే.. సెగలు పుట్టించే శృంగార రసిక వాత్సాయన కామ క్రీడలు ఇకపై కుదరవని చెబుతున్నారు. ఇది అటు సినిమాకి - ఇటు వెబ్ టీవీ షోలు - సిరీస్ లకు వర్తిస్తుందిట. స్టేజీ డ్రామాల నుంచి ప్రతిదీ శృంగార సన్నివేశం చూపించాలంటే కచ్ఛితంగా ఒక అడ్వొకేట్ తరహా ఉద్యోగి దానికి కట్ చెప్పేందుకు రెడీగా ఉంటాడట. అంటే అది కేవలం డైరెక్టరు - కెమెరామేన్ల చేతి నుంచి లాక్కోవడమేనన్నమాట.
అయితే ఇంతటి తెగింపుతో ఆ నిర్ణయం తీసుకోవాలని అనుకోవడానికి కారణం లేకపోలేదు. 16 ఏళ్ల వయసు నుంచి శృంగార చిత్రాల్లో నటిస్తున్న మీడే అనే ఆవిడ తనపై జరిగిన ఆకృత్యాల్ని ప్రఖ్యాత హెచ్ బీవో చానెల్ వారికి ఫిర్యాదు చేసింది. టీనేజీ వయసులో శృంగార సన్నివేశాల్లో నటించేప్పుడు దారుణమైన పరిస్థితుల్ని - ఎంతో అసౌకర్యమైన ప్రవర్తనను ఎదుర్కొన్నానని ఆవేదన వెల్లగక్కింది. దారిలో కార్ లో వెళుతుంటే ఏదైనా కుక్కనో - పిల్లినో అడ్డుపడితే అయ్యో పాపం అని ఆగి వెళతాం. కానీ సెట్ లో దారుణం జరిగేప్పుడు చింతించడానికి కూడా ఎవరూ ఉండరు... అంటూ తన ఆవేదన వెల్లగక్కింది. అంతేకాదు.. తనకో లాయర్‌ని అపాయింట్ చేసి ఆన్ లొకేషన్ ఆ సీన్లు చిత్రీకరించేప్పుడు కొన్నిటిని అదుపులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో హెచ్ బీవో తెరకెక్కిస్తున్న తాజా టీవీ షో `ది డ్యూస్- సీజన్ 2` ఆన్ లొకేషన్ ఓ ఇంటిమసీ కోఆర్డినేటర్ ని నియమించుకున్నారట. ప్రపంచంలోనే ఈ తరహా ఇదే తొలిసారి అని సదరు చానెల్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికైతే ఇది హెచ్ బీవో వరకే పరిమితం. మునుముందు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి - అట్నుంచి ఇతర పరిశ్రమలకు ఇది పాకిపోతుందేమో? అలా జరిగితే మంచిదే మరి!
అయితే ఇది కొందరికి మోదం.. కొందరికి ఖేదం! ఇదేం లంపటం? అని ఫీలయ్యేవాళ్లు పరిశ్రమలో ఉంటారేమో! శ్రుతి మించితే ఆయన ఆన్ సెట్స్ లో మొట్టికాయ వేస్తాడట. ఇది కుదిరే పనేనా? పెదవి ముద్దుకి - బెడ్ రూమ్ సీన్ కి కొలతలా? ఇదేం కోఆర్డినేషన్ వృత్తి బాబోయ్ అనేస్తారేమో?