చీకట్లో ఉన్న ఆ సినిమా వెలుగులోకి..

Update: 2016-12-15 19:30 GMT
ఓ వైపు బడా హీరోలతో పని చేస్తూనే.. మరోవైపు కొత్త కథానాయకులతోనూ పని చేశాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన చేతుల మీదుగా పరిచయమైన కొత్త హీరోలు చాలామంది పెద్ద స్టార్లు అయ్యారు. అందుకే ‘శ్రీరామరాజ్యం’ నిర్మాత యలమంచిలి సాయిబాబా కూడా తన కొడుకుని రాఘవేంద్రుడి చేతికే అప్పగించాడు.  యలమంచిలి రోహిత్ హీరోగా రాఘవేంద్రరావు నాలుగైదేళ్ల కిందట ‘ఇంటింటా అన్నమయ్య’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్‌ లో ఉండగానే ఈ సినిమా గురించి చాలా పబ్లిసిటీ చేశారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో భారీ ఫ్లెక్సీలు కనిపించేవి అప్పట్లో.

కానీ ఏమైందో ఏమో కానీ.. ‘ఇంటింటా అన్నమయ్య’ విడుదలకు నోచుకోలేదు. మూడేళ్లుగా ఈ సినిమా ఊసే వినిపించట్లేదు. దీంతో ఈ చిత్రం ఇక ఎప్పటికీ వెలుగుచూడదనే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ‘ఇంటింటా అన్నమయ్య’ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజాగా శ్రీశైలం వచ్చిన ఈ చిత్ర హీరో రోహిత్.. తన సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుందన్నాడు. అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల ఆగిపోయిందని.. ఇప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పాడు. రోహిత్ వైజాగ్ సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకోవడం విశేషం. సంగీత ప్రధానంగా సాగే ‘ఇంటింటా అన్నమయ్య’లో రోహిత్ సరసన ‘జర్నీ’ ఫేమ్ అనన్య కథానాయికగా నటించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News